GDWL: ప్రాథమిక విద్యే జీవితానికి అసలైన పునాది, చదవడం, రాయడం అర్థం చేసుకోవడం నైపుణ్యాలు బలంగా ఉంటేనే పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. మంగళవారం కేటిదొడ్డి మండలం పాగుంట పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. కలెక్టర్ గురువుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బోర్డుపై అక్షరాలు రాయించి, ప్రశ్నలు అడిగారు.