TG: తన రుణమాఫీ చేయాలని భువనగిరి జిల్లా జంగారెడ్డిపల్లికి చెందిన నరసింహారెడ్డి అనే రైతు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రూ.2లక్షల లోపు రైతు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం GO 567 విడుదల చేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. అరుర్ కెనరా బ్యాంకులో రూ. 1.5 లక్షల రుణం తాను తీసుకున్నానని.. కానీ తనకు రుణమాఫీ కాలేదని వెల్లడించారు.