టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్షన్లో బాలీవుడ్ నుంచి వచ్చిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనిమల్.. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. 500 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఎంత రాబట్టిందంటే?
అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లేటెస్ట్ మూవీ యానిమల్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక హీరోయిన్గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చింది. సాలిడ్ బజ్‌తో రిలీజ్ అయిన ఈ సినిమా.. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. డే వన్ రూ.116 కోట్లు కలెక్ట్ చేసింది యానిమల్. ఇక మొదటి రోజు కన్నా రెండో రోజు, మూడో రోజు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. రెండు రోజుల్లో రూ.236 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన యానిమల్.. ఆదివారం నాటికి మొత్తంగా మూడు రోజుల్లో రూ.356 కోట్ల మార్క్‌ని రీచ్ అయింది.
ఇక సోమవారంతో రూ.400 కోట్ల గ్రాస్ కలెక్షన్లను క్రాస్ చేసింది. దీంతో ఇండియాలో యానిమల్ మూవీ నాలుగు రోజుల్లో రూ.229 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. దీంతో ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే సరికి యానిమల్ సినిమా రూ.500 కోట్ల గ్రాస్ మార్క్‌ను ఈజీగా చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు 210 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయిన యానిమల్ మూవీ.. ఇప్పటికే అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయింది.
ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ అంతా లాభాలే. ఇప్పటికీ థియేటర్లో 48.92 ఆక్యుపెన్సీని మెయింటెన్ చేస్తుంది యానిమల్. కాబట్టి ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి భారీ వసూళ్లను రాబట్టడం గ్యారెంటీ. మొత్తంగా రణ్‌బీర్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా యానిమల్ నిలిచేలా ఉంది. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ఇప్పటికే దిల్ రాజుకు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది యానిమల్. మరి లాంగ్ రన్లో యానిమల్ ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.