»Prabhas Good News For Prabhas Fans Spirit Shooting Time Has Arrived
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ షూటింగ్ టైం వచ్చేసింది?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో స్పిరిట్ అనే సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. లేటెస్ట్గా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ బయటికొచ్చేసింది. ఇంతకీ స్పిరిట్ షూటింగ్ ఎప్పటి నుంచి?
Prabhas: ప్రస్తుతానికి ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు అరడజను వరకు ఉంటాయి. నాగ్ అశ్విన్ ‘కల్కి’ రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉందని సమాచారం. ఇక ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ ఈ సమ్మర్లోనే సెట్స్ పైకి వెళ్లేలా ఉంది. అలాగే మారుతితో చేస్తున్న రాజాసాబ్ షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ వెంటనే హను రాఘవపూడితో సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్లో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. హను ప్రాజెక్ట్‌కు కాస్త టైం పట్టినప్పటికీ.. స్పిరిట్ మాత్రం ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ కూడా స్పిరిట్‌కు డేట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ చేయడానికి ప్రభాస్ డేట్లు ఇచ్చినట్టుగా సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగ.. ప్రభాస్ డేట్ల పై క్లారిటీ రావడంతో.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పై మరింత ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. డిసెంబర్లో షూటింగ్ స్టార్ట్ అయితే.. 2026లో స్పిరిట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇక స్పిరిట్‌లో ప్రభాస్‌ను పవర్ ఫుల్ ఆఫీసర్‌గా చూపించబోతున్నాడు సందీప్. మామూలుగానే తన సినిమాల్లో హీరోలను ఓ రేంజ్లో చూపిస్తుంటాడు సందీప్. అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాల్లో సందీప్ హీరోలను చూస్తే ఎవ్వరైనా భయడాల్సిందే. అలాంటిది.. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా కటౌట్‌ని ఇంకెలా చూపిస్తాడనేది ఊహకందకుండా ఉంది. ఖచ్చితంగా ప్రభాస్ కెరీర్లో స్పిరిట్ ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అయ్యేలా ఉంది.