Vijay Devarakonda: చివరగా ఖుషి సినిమాతో మంచి హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు రౌడీ. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ విషయానికొస్తే.. ఏదైనా చేయడానికి రెడీ అనేలా ఉంటారు. లేడీ ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు. ఈ మధ్య ఓ లేడీ ఫ్యాన్ ఇన్‌స్టాలో తను చేసిన వీడియోకి రిప్లే ఇస్తేనే ఎగ్జామ్స్ రాస్తాను, చదువుతానని పోస్ట్ చేసింది. దీనికి విజయ్ కూడా చదువుకోండని రిప్లే ఇచ్చాడు.
See this guys
Blood Art ani cheppagane @TheDeverakonda : Blood hah aarey mental etlanti cheyyodu annadu #FamilyStarOnApril5th #VijayDeverakonda https://t.co/NL42Y9Wkw6 pic.twitter.com/rZdojFxJq0
— THE Dinesh Kumar (@TheRowdyDinesh) March 29, 2024
ఇది కూడా చూడండి: Tillu Square: ఫస్ట్ డే దుమ్ములేపిన టిల్లుగాడు.. ఊహించని ఓపెనింగ్స్!
ఇలా రౌడీ ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండడం లేదు. ఇక ఇప్పుడు ఓ అభిమాని ఏకంగా తన రక్తంతో విజయ్ దేవరకొండ చిత్రాన్ని గీసి దానిని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే.. విజయ్ దేవరకొండకు అభిమాని ఆ ఫోటోను ఇస్తుండగా.. అది మామూలుగా గీసిన చిత్రం కాదని.. బ్లడ్తో గీసింది తెలిసింది. దీంతో.. సదరు అభిమానిని మళ్లీ వెనక్కి లాగి, బ్లడ్ ఆ.. అరే మెంటలా.. ఇలాంటివి చేయొద్దు అన్నట్టుగా.. చేయెత్తి కొట్టినట్టుగా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది కూడా చూడండి: Nithin: ‘తమ్ముడు’ నితిన్.. ఫస్ట్ లుక్ అదిరింది!
అయినా రౌడీ చెప్పినట్టుగా.. అభిమానం అనేది హద్దులు దాటకుండా ఉంటే బెటర్. ఒక్కోసారి ఇలాంటివి ప్రాణాల మీదకు తెస్తాయి. అయితే.. తన ఫ్యాన్స్ మాత్రమే కాదు.. వాళ్ల కోసం రౌడీ కూడా ఏదో ఒకటి చేస్తునే ఉంటాడు. ఆ మధ్య వంద మందికి దేశమంతా టూర్ వేయించాడు. ఆ తర్వాత ఆర్థిక సాయం లాంటివి చేస్తునే ఉన్నాడు.

