»Spirit First Day Rs It Will Collect 150 Crores Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga: స్పిరిట్ ఫస్ట్ డే రూ. 150 కోట్లు వసూళ్ చేస్తుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని డైరెక్టర్ పంచుకున్నారు. ఆయన మాటలతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
Spirit First Day Rs. It will collect 150 crores.. Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga: సెన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆ మూవీకి స్పిరిట్ అనే టైటిల్‌ను ఖారారు చేశారు. దీనికి సంబంధించిన ఓ అప్డేట్ ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ సినిమాపై తాజాగా డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలతో.. ఆసక్తితో పాటు అంచనాలు ఆకాశాన్ని తాకాయి. భారీ బడ్జెట్ రూ. 300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సందీప్ వంగా ప్రకటించారు. అయితే షాటిలైట్స్, ఆడియో, డిజిటల్ రైట్స్‌తో సినిమా విడుదలకు ముందే పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి అని, సినిమా విడుదలైన మొదటి రోజే రూ. 150 కోట్లు వసూళ్ చేస్తుందని అన్నారు. ఇది అతివిశ్వాసం కాదని, సినిమా అంటేనే వ్యాపారం అని చెప్పారు.
టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకుంటే చాలు కంటెంట్‌తో కూర్చోబెట్టొచ్చు అని అన్నారు. అదేవిధంగా స్పిరిట్ సినిమాలో ప్రభాస్ చాలా భిన్నమైన లుక్‌లో కనిపిస్తాడు అని, ఆయన చేసిన 24 సినిమాల్లో స్పిరిట్ స్పెషల్‌గా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభాస్‌లో చాలా స్పెషల్స్ ఉన్నాయని, ఆయన వెనక్కి తిరిగి చూసే స్టైల్ చాలా బాగుంటుందని సందీప్ తెలిపారు. ఆయన స్టైల్ ఆడియెన్స్‌కు నచ్చితే చాలు సినిమా సూపర్ హిట్ అవుతుందని అన్నారు. ఇక బేబీ, ఉప్పెన రెండు సినిమాలో ఏదైన తీయమంటే ఏది తీస్తారు అని అడిగితే.. ఉప్పెన చాలా బాగుంది అన్నారు. అలాగే తాను ప్రొడ్యూస్ చేద్దామని కథలు విన్నట్లు, ఏ కథ పెద్దగా నచ్చలేదని చెప్పారు. కథ బాగుంటే ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు. భవిష్యత్తులో మైఖేల్ జాక్సన్ బయోపిక్ తీస్తానని అన్నారు.