Family Star : నాలుగో రోజు మరింత పడిపోయిన ఫ్యామిలీ స్టార్ కలెక్షన్లు
విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం గత శుక్రవారం విడుదలై నెగెటివ్ టాక్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. సోమవారం నాటికి ఈ చిత్ర వసూళ్లు మరింతగా పడిపోయాయి. నాలుగో రోజు ఇంతకీ ఈ చిత్రం ఎంత వసూలు చేసిందంటే...?
Family Star box office collection : విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం డే 1 నుంచే నెగెటివ్ టాక్ని మూటగట్టుకుంది. దీంతో ఫస్ట్ వీకెండ్లోనే ఫెయిలయింది. సోమవారం నాటికి దీని కలెక్షన్లు మరింత పడిపోయాయి. మూడో రోజు కంటే నాలుగో రోజు కలెక్షన్లు సగానికి పడిపోవడం గమనార్హం. అయితే మంగళవారం (ఏప్రిల్ 9) ఉగాది, గురువారం (ఏప్రిల్ 11) రంజాన్ హాలిడేస్ ఉండటంతో సినిమా పుంజుకునే అవకాశం ఉంటుందని మేకర్స్ ఆశతో ఉన్నారు.
తొలి రోజు తెలుగులో రూ.5.55 కోట్ల కలెక్షన్లతో ఫ్యామిలీ స్టార్ మొదలైంది. తర్వాత నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ ప్రభావంతో రెండో రోజు కలెక్షన్లు రూ.3.1 కోట్లు, మూడో రోజు రూ.2.75 కోట్లు, నాలుగో రోజు(day 4) రూ.1.5 కోట్లు వసూలు చేసింది. తమిళంలోనూ ఈ సినిమా రిలీజైంది. అక్కడ నాలుగు రోజులు కలిపి కేవలం రూ.1.07 కోట్లు మాత్రమే రాబట్టింది.
ఫ్యామిలీ స్టార్(Family Star) మూవీ నాలుగు రోజులు కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ.23.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు వార్తలు వస్తున్నాయి. నాలుగో రోజైన సోమవారం ఈ మూవీ కేవలం రూ.1.5 కోట్లు మాత్రమే రాబట్టింది. నాలుగు రోజులు కలిపి ఇండియాలో మూవీ గ్రాస్ కలెక్షన్లు రూ.14.2 కోట్లుగా ఉండగా, ఓవర్సీస్ నుంచి రూ.9 కోట్లు వచ్చాయి. దీంతో సుమారు రూ.60 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ డిజాస్టర్ దిశగా వెళ్తోంది. సోషల్ మీడియాలో సినిమాపై తొలి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. మూవీ చాలా బాగుందని కొందరు ట్వీట్స్ చేయగా.. మరికొందరు మాత్రం మరీ చెత్తగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. దీంతో చివరికి సినిమా నష్టాలను మూటగట్టుకునేట్టు కనిపిస్తోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.