NLR: కావలి మండలం కొండయ్య గారి పాలెం గ్రామ సమీపంలోని అమ్మవారి గుడి దగ్గర ఖాళీ ప్రదేశంలో కోడిపందాలు ఆడుతున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించారు. దాడిలో ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 10,050వేలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తిరుమలరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. మండలంలో ఎక్కడైనా కోడిపందాలు ఆడితే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.