KMR: హైదరాబాద్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ను ఆదివారం రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ కామారెడ్డి జిల్లా కన్వీనర్ గీరెడ్డి మహేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. రానున్నమున్సిపాలిటీ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని, గ్రూప్ తగాదాలను పక్కనపెట్టి ఐక్యంగా పని చేయాలన్నారు.