అనుకున్నట్టే సలార్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు ప్రభాస్. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేసిన సినిమా కావడంతో.. భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చింది సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను అందుకుంటోంది సలార్.
మొదటి మూడు రోజుల్లో రోజుకి వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి.. వరల్డ్ వైడ్‌గా 402 కోట్లు కొల్లగొట్టింది సలార్. డే వన్ 178 కోట్లు, డే 2-117 కోట్లు, డే-107 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది సలార్. ఇక నాలుగో రోజు క్రిస్మస్ హాలీడే కలిసి రావడంతో.. భారీ వసూళ్లు వచ్చాయి. క్రిస్మస్ రోజు ఒక్క ఇండియాలోనే 45 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఇండియాలో తొలి నాలుగు రోజులు కలిపి మొత్తంగా.. 255 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. మూడు రోజుల్లోనే 402 కోట్లు రాబట్టిన సలార్.. నాలుగో రోజు 450 కోట్ల మార్క్ దాటగా.. ఐదో రోజు 500 కోట్ల టార్గెట్ రీచ్ కానుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో దుమ్ముదులుపుతోంది సలార్. ఒక్క తెలుగులోనే 111 కోట్లకు పైగా షేర్, 168 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 222 కోట్లకు పైగా షేర్, 450 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందంటున్నారు.
దీంతో ట్రిపుల్ ఆర్ రికార్డును బ్రేక్ చేసింది సలార్. నాలుగు రోజుల్లోనే 200 కోట్లు షేర్ మార్కును చేరుకుని సెన్సేషన్ అయింది. అదే సమయంలో నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్‌ను రాబట్టిన చిత్రంగా కూడా రికార్డు సాధించింది. ఇక ‘సలార్: సీజ్ఫైర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో.. మరో 125 కోట్లు వరకూ షేర్ వసూలు చేస్తే అన్ని చోట్ల సలార్ బ్రేక్ ఈవెన్ రీచ్ అయినట్టేనని అంటున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ పై డైనోసర్ చేస్తున్న దండయాత్ర చూస్తుంటే.. సెకండ్ వీకెండ్లోనే సలార్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయి లాభాల బాట పట్టనుంది. సంక్రాంతి వరకూ సలార్‌దే హవా ఉంటుంది. కాబట్టి.. సలార్ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ రేంజ్ వసూళ్లను నమోదు చేయడం గ్యారెంటీ.