»Shocking Comments On Salar Prashant Neil Did Not Listen
‘సలార్’ పై షాకింగ్ కామెంట్స్.. ప్రశాంత్ నీల్ అస్సలు వినలేదు!
ప్రస్తుతం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది సలార్ సినిమా. ప్రభాస్ కటౌట్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్‌కు మాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేసిన శ్రియా రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన సలార్ సినిమా డే వన్ నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా నాలుగు రోజుల్లో 450 కోట్లు క్రాస్ చేసింది. ఒక్క నైజాం ఏరియాలోనే 50 కోట్లకు పైగా షేర్ వసూళ్లను అందుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 111 కోట్లకు పైగా షేర్, 168 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు చాలామంది నటీనటులు కనిపించారు. అందులో శ్రియ రెడ్డి పాత్ర హైలెట్‌గా నిలిచింది. రాజమన్నార్ జగపతిబాబు కుమార్తె రాధారమగా శ్రియ రెడ్డి కనిపించింది. అయితే.. శ్రియ రెడ్డి సినిమాలకు దూరమై సుమారు ఆరేడేళ్లవుతోంది. దీంతో.. ఈ సినిమా అవకాశం వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అని అడిగితే ఆమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
ప్రశాంత్ నీల్ ఈ సినిమా చేయమని అడిగినప్పుడు.. తాను చేయలేనని చెప్పాను.. ఎన్నోసార్లు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాను.. కానీ మీరు ఒప్పుకునే వరకు వదల్లేదు. చెన్నై వచ్చి కథ వినిపిస్తానని ప్రశాంత్ నీల్ చెప్పడంతో ఒప్పుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రశాంత్ తనకు ఒక మాట ఇచ్చాడని.. పక్కన ప్రభాస్ ఉన్నాడా? లేక వేరే నటులు ఉన్నారా? అనే విషయం పక్కన పెడితే.. మీ పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పాడు. దీంతో సినిమా చేయడానికి ఓకె చెప్పానని చెప్పుకొచ్చింది. అలాగే.. రాధారమ పాత్ర కోసం చాలా కష్టపడ్డానని.. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ ఇబ్బంది పెట్టాయని చెప్పింది. బరువైన చెవి పోగులు పెట్టుకోవడంతో.. చెవులు చీరుకుపోయాయట. దీంతో షూటింగ్ ముగిశాక సర్జరీ చేయించుకుందట. చీర రంగు విషయంలో కూడా గొడవ జరిగిందట. ఓ సన్నివేశంలో ఎల్లో కలర్ చీర అయితే బాగుంటుందని నేను సూచించాను. అందుకు ప్రశాంత్ నీల్ ఒప్పుకోలేదు. అయితే ప్రశాంత్ నీల్‌తో వాదించి పసుపు రంగు చీర ధరించాను.. అని ఆమె అన్నారు. ప్రస్తుతం శ్రియా రెడ్డి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.