»Business Development Manager One Page Resume India Sample Editable
Game Changer: గుడ్ న్యూస్ చెప్పిన దిల్ రాజు..’గేమ్ చేంజర్’ రిలీజ్ డేట్ ఇదే?
ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. ఇప్పట్లో థియేటర్లోకి రావడం కష్టమే అంటున్నారు. కానీ తాజాగా నిర్మాత దిల్ రాజు దీనిపై క్లారిటీ ఇచ్చినట్టుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
business development manager one page resume india sample editable
రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ నుంచి గుడ్ న్యూస్ విని చాలా రోజులే అవుతోంది. దీపావళికి లీక్ అయిన జరగండి సాంగ్‌ను రిలీజ్ చేస్తామని చెప్పి.. పోస్ట్ పోన్ చేసి మెగా ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేశారు. అప్పటి నుంచి గేమ్ చేంజర్ గురించి మరో గుడ్ న్యూస్ బయటికి రాలేదు. అలాగే రిలీజ్ డేట్ విషయంలోను మెగాఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. త్వరలోనే గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ అవుతుందని చెబుతున్నప్పటికీ.. రిలీజ్‌కు మాత్రం చాలా రోజులు వెయిట్ చేయాల్సిందేనని వార్తలు వస్తునే ఉన్నాయి. వచ్చే సమ్మర్‌లోనైనా గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుందనే ఆశలో ఉన్నారు చరణ్ ఫ్యాన్స్. కానీ సమ్మర్ కాకుండా.. నెక్స్ట్ ఇయర్ దసరాకే గేమ్ చేంజర్ వచ్చే ఛాన్స్ ఉందనే న్యూస్.. ఆ మధ్య వైరల్‌గా మారింది.
కానీ కాస్త ముందుకు వచ్చినట్టుగా లేటెస్ట్ అప్డేట్ చెబుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై నిర్మాత దిల్ రాజు ఒక క్లారిటీ ఇచ్చాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సలార్ సినిమా చూడడానికి వెళ్లిన దిల్ రాజును.. గేమ్ ఛేంజర్ అప్డేట్ అడిగారట అభిమానులు. దీంతో.. గేమ్ చేంజర్ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్ కానుందని చెప్పుకొచ్చాడట. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కానీ ఇదే విషయాన్ని అఫీషియల్‌గా ఎందుకు అనౌన్స్ చేయడం లేదనేదే.. అర్థం కాకుండా పోయింది. ఒకవేళ గేమ్ చేంజర్ 2024 సెప్టెంబర్‌లో వస్తే.. మరో పది నెలలు మెగా ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే. ఇక శంకర్ ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కియార అద్వాని హీరోయిన్గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.