»Naga Chaitanya In The Middle Of The Sea Tandel Hunting Begins
సముద్రం మధ్యలో నాగచైతన్య.. తండేల్ వేట షురూ!
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న అక్కినేని నాగ చైతన్య.. రీసెంట్గా వచ్చిన 'ధూత' వెబ్ సిరీస్‌తో మంచి రిజల్ట్ అందుకున్నాడు. ఇదే జోష్‌లో ఇప్పుడు తండేల్ కోసం రంగంలోకి దిగాడు చైతన్య. తాజాగా తండేల్ వేట షురూ అయింది.
ఈసారి లవర్ బాయ్ ఇమేజ్ పక్కకు పెట్టేసి.. పక్కా మాస్ హీరోగా రాబోతున్నాడు నాగ చైతన్య. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటితో కలిసి భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు చైతన్య. గతంలో నాగ చైతన్య, చందు మొండేటి కలిసి ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాలు చేసారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడో సినిమా తండేల్. ఈసారి సముద్రం బ్యాక్ డ్రాప్లో ఊరమాస్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, గుజరాత్ సముద్ర తీర ప్రాంతాల్లో షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్లో దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు అల్లు అరవింద్. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కి రెడీ అయింది. ఇటీవలె ‘తండేల్’ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో నాగ చైతన్య జాలరీగా కనిపించనున్నాడు. తాజాగా తండేల్ ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. నాగచైతన్య ఇతర నటీనటులపై వచ్చే సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించబోతున్నారు. సముద్రం మధ్యలో జరగనున్న ఈ షెడ్యూల్ సినిమాలో కీలకం కానుందని తెలుస్తోంది. షూటింగ్ మొదలైన సందర్భంగా రిలీజ్ చేసిన నాగచైతన్య మాస్ లుక్ అదిరింది. బోట్ల మధ్య నడుస్తూ కనిపిస్తున్నాడు చైతూ.
తండేల్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ స్టోరీ అవడంతో తండేల్ పై భారీ అంచనాలున్నాయి. మరి తండేల్‌లో చైతన్య ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.