సలార్ ట్రైలర్ విడుదలైంది. డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రెబల్ స్టార్ ప్రభాస్ కలయికలో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. అద్భుతమైన డైలాగ్స్, మ్యూజిక్, ఫైట్ సీన్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.
కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రతిష్టాత్మకంగా సలార్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండు పార్టులుగా ఈ మూవీ రాబోతుందని తెలియడంతో ఫ్యాన్స్ ఎగిరి గంతేసినంత ఆనందంలో ఉన్నారు. అయితే ఫస్ట్ పార్ట్ అనేక వాయిదాల తర్వాత డిసెంబర్ 22వ తేదిన విడుదలకు సిద్ధమైంది.
సలార్ ట్రైలర్:
ఇప్పటికే సలార్ మూవీకి కావాల్సినంత హైప్ కూడా వచ్చేసింది. నేడు డిసెంబర్ 1వ తేదిన సలార్ ట్రైలర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. చెప్పినట్లుగానే మేకర్స్ నేడు సలార్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ట్రైలర్ చూసినవారికి రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్లో ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.
‘సలార్’ ట్రైలర్లో అందరూ మెయిన్ లీడ్స్‌ని చూపించిన తర్వాత చివరలో ప్రభాస్ కనిపిస్తాడు. యాక్షన్‌తో అదరగొట్టే ఫైట్ సీన్స్ వేరే లెవల్ హై అనిపిస్తాయి. రవి బస్రూర్ సంగీతం హైలెట్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ట్రైలర్ చూస్తుంటే దుమ్మరేగ్గొట్టేలా ఉంది. ఖన్సార్ అనే ప్రాంతాన్ని జగపతిబాబు ఏలుతుంటాడు. అతని కొడుకే పృథ్వీ రాజ్. అయితే జగపతిబాబు పనిమీద బయటకెళ్లినప్పుడు పృథ్వీరాజ్‌ను కొందరు అంతమొందించాలని చూస్తారు. దీంతో పృథ్వీరాజ్ తన చిన్నప్పటి ఫ్రెండ్ దేవా అయిన ప్రభాస్ సాయం తీసుకుంటాడు. ఓవరాల్‌గా ఫైట్ సీన్స్, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ బీజీఎంలు అదిరిపోయాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఇక కాలర్ ఎగరేయాల్సిన సమయం వచ్చేసింది.
తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఈమూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. సలార్ పార్ట్ 1 ట్రైలర్ 3 నిమిషాల 47 సెకండ్స్ ఉండగా ఇది అందర్నీ కట్టిపడేసిందనే చెప్పాలి. ట్రైలర్లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ కోసం ప్రాణాలను సైతం ఇచ్చే స్నేహితుడిగా ప్రభాస్ యాక్షన్ వేరే లెవల్. జగపతి బాబు విలనిజం ట్రైలర్‌కు హైలెట్‌గా నిలిచింది. ప్రతి సన్నివేశం అందర్నీ కట్టిపడేస్తోంది. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ఈ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.