»Veerappan In Trending The Hunt For Veerappan With Real Visuals
Veerappan ట్రెండింగ్.. రియల్ విజువల్స్‌తో ‘ది హంట్ ఫర్ వీరప్పన్’!
వీరప్పన్.. ఈ పేరు వింటే చాలు, అప్పట్లో సౌత్ స్టేట్స్ గజగజ వణికిపోయేవి. ఈ మాస్టర్ మైండ్ స్మగ్లర్‌ను పట్టుకోవడానికి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు చేసిన ఎత్తులు పై ఎత్తులు, రివార్డులు అన్ని ఇన్నీ కావు. ఫైనల్‌గా 2004లో వీరప్పన్‌ను మట్టుబెట్టారు పోలీసులు. అప్పటి నుంచి వీరప్పన్ పై సినిమాలు వస్తునే ఉన్నాయి. ఇక ఇప్పుడు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు వీరప్పన్.
Veerappan in trending.. 'The Hunt for Veerappan' with real visuals!
Veerappan: అడవి జంతువులు కూడా వీరప్పన్ పేరు వింటే హడలెత్తిపోయేలా.. చీమలు దూరని చిట్టడవిలో, కాకులు దూరని కారడవిలో స్మగ్లింగ్ చేసి.. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను వణికించాడు వీరప్పన్. ఇటు తెలుగు స్టేట్‌ను కూడా భయపెట్టాడు. ఈయనను పట్టుకోవడానికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల చేసిన ఎత్తుగడలు ఎన్నో. గంధపు చెక్కల స్మగ్లర్‌గా ప్రసిద్ధి చెందిన వీరప్పన్.. ఏకంగా కన్న స్టార్ హీరో రాజ్ కుమార్‌ని కిడ్నాప్ చేసి సంచలనం సృష్టించాడు. నాలుగు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి.. వందలాది ప్రాణాలను తీశాడు. కానీ ఫైనల్‌గా వీరప్పన్‌ను తమ ఎత్తుగడలతో పట్టుకొని మట్టుబెట్టారు పోలీసులు. అప్పటి నుంచి వీరప్పన్ కథ పై ఎన్నో సినిమాలు, డాక్యుమెంటరీస్, పుస్తకాలు వచ్చాయి.
రామ్ గోపాల్ వర్మ తీసిన వీరప్పన్ మూవీ అదిరిపోయింది. ఇప్పటికీ ఈ సినిమాను యూట్యూబ్‌లో చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. అయితే వర్మ ఈ సినిమాను రియాలిస్టిక్‌గా తెరకెక్కించినప్పటికీ.. అది సినిమా కావడంతో సెన్సార్ బోర్డ్ అనుగుణంగానే సినిమా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఓటిటిలో ఎలాంటి సెన్సార్ అక్కర్లేదు. తాజాగా ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ‘ది హంట్ ఫర్ వీరప్పన్’ పేరుతో నాలుగు ఎపిసోడ్ల డాక్యుమెంటరీని ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చింది. అతని భార్య ముత్తులక్ష్మి ఇంటర్వ్యూతో మొదలుపెట్టి.. వీరప్పన్ ఎలా బ్రతికాడు, ఎలా తప్పించుకునే వాడు.. ఆయన కోసం ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీస్ ఆఫీసర్లు ఏం చెప్పారు? ఇలాంటి సంఘటనలతో ‘ది హంట్ ఫర్ వీరప్పన్’ తెరకెక్కింది.
ఇందులో ఒరిజినల్ ఫోటోలు, వీడియోలు కూడా చూపించారు. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ సిరీస్.. మూవీ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. సినిమాటిక్‌గా కాకుండా రియల్ విజువల్స్‌తో.. తమిళనాడు, కర్ణాటక అడవుల్లో వీరప్పన్ తిరిగిన ప్రాంతాల్లో దీన్ని తెరకెక్కించారు. ఆగష్టు 4 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో ‘ది హంట్ ఫర్ వీరప్పన్’ స్ట్రీమింగ్ అవుతోంది. వీలైతే మీరు ఓ లుక్కేయండి.