Rana naidu చూస్తేనే కదా ట్రెండింగ్‌లో ఉంది.. లేదంటే ఎలా: నవదీప్
రానా నాయుడు ( Rana naidu) వెబ్ సిరీస్ గురించి నటుడు నవదీప్ (navdeep) స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో వెబ్ సిరీస్ గురించి ప్రశ్న వేయగా.. ప్రస్తుత జనరేషన్‌కు (generation) నచ్చుతుందని చెప్పారు. వారు చూసి ఎంజాయ్ (enjoy) చేస్తున్నారని తెలిపారు.
Actor navdeep:రానా నాయుడు ( Rana naidu) వెబ్ సిరీస్ గురించి నటుడు నవదీప్ (navdeep) స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో వెబ్ సిరీస్ గురించి ప్రశ్న వేయగా.. ప్రస్తుత జనరేషన్‌కు (generation) నచ్చుతుందని చెప్పారు. వారు చూసి ఎంజాయ్ (enjoy) చేస్తున్నారని తెలిపారు. తనలాగా చాలా మంది చూసి ఆనందిస్తున్నారని వివరించారు. అలా కోట్ల మంది ఉంటారని.. అందుకే ఆ వెబ్ సిరీస్ నెట్ ప్లిక్స్లో ట్రెండింగ్‌లో ఉందని చెప్పారు.
ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని.. తనకు మాత్రం నచ్చిందని నవదీప్ (navdeep) తెలిపారు. వెబ్ సిరీస్ చూశామా..? నచ్చిందా..? లేదా మాత్రమే చెప్పగలం అన్నారు. ముంబై నేపథ్యంలో సాగిన కథ అయినందున.. అలానే ఉంటుందని వివరించారు. అక్కడి కల్చర్ (culture) ఎలా ఉంటుందో తనకు తెలుసు అని.. అందుకే సరదాగా చూశాం అని క్లారిటీ ఇచ్చారు.
కొందరికీ నచ్చకపోవచ్చు.. వారి అభిప్రాయం వారిది. ఎందుకంటే న్యూడిటీ గురించి అంతా అనుకుంటారు. కాకుంటే మెసేజ్ కూడా అర్థం చేసుకోవాలని సూచించారు. సిరీస్‌లో న్యూడిటీ ఎక్కువగా ఉంది. డైలాగులు కూడా పచ్చిగా ఉన్నాయి. ఫ్యామిలీ హీరో వెంకటేష్ (venkatesh) చేత బొల్డ్ డైలాగ్స్ చెప్పించారు. రానా (rana) కూడా అలాంటి ఓ సీన్లో నటించారు.
వెంకటేష్, రానా అభిమానులు చూసి ఉంటారు. లేడీస్ (ladies) మాత్రం చూసే ధైర్యం చేయరు. పెద్ద వారి నుంచి కూడా వ్యతిరేకత రానుంది. విడుదలయిన వెంటనే నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అయినప్పటికీ వెబ్ సిరీస్ మాత్రం ట్రెండింగ్‌లో ఉంది. దీని సెకండ్ సీజన్ కూడా ఉండే అవకాశం ఉంది.