Love Mouli Trailer: టాలీవుడ్ నటుడు నవదీప్ నటిస్తున్న తాజా చిత్రం లవ్ మౌళి (Love Mouli). ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి సి స్పేస్ ఈ చిత్రాన్ని రూపోందిస్తుంది. ఈ సినిమాలో పంఖురి గిద్వానీ కథనాయికగా నటిస్తుంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తుంటే కల్ట్ సీన్స్ చాలానే ఉన్నట్లు అర్థం అవుతుంది. ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. ప్రపంచంలో నిజమైన ప్రేమ కోసం, తనకు నచ్చిన అమ్మాయికోసం వెతికే మౌళి కథ అని తెలుస్తుంది. అలాంటి వ్యక్తికి అనూహ్యంగా ప్రేమ దొరికితే ఎలా ఉంటుంది అనేది మైయిన్ థీమ్ అనిపిస్తుంది. నాలుగు నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగానే ఉంది. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎలా ఉండబోతుందో చూడాలి.