»Delhi Mayoral Election Mcd To Make Its Fourth Attempt To Elect Mayor Today
Delhi Mayor Election: కాసేపట్లో ఢిల్లీ మేయర్ ఎన్నిక
ఢిల్లీ మేయర్ ఎన్నిక (Delhi Mayor Election) ఈ రోజు (బుధవారం, ఫిబ్రవరి 22) జరగనుంది. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 2022 డిసెంబర్ 7న ప్రకటించిన ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి 104 (bharatiya janata party), ఆమ్ ఆద్మీ పార్టీకి (Aam Admi party) 134, కాంగ్రెస్ పార్టీకి (Congress) 9 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే.
ఢిల్లీ మేయర్ ఎన్నిక (Delhi Mayor Election) ఈ రోజు (బుధవారం, ఫిబ్రవరి 22) జరగనుంది. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 2022 డిసెంబర్ 7న ప్రకటించిన ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి 104 (bharatiya janata party), ఆమ్ ఆద్మీ పార్టీకి (Aam Admi party) 134, కాంగ్రెస్ పార్టీకి (Congress) 9 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. ముగ్గురు స్వతంత్రులు గెలిచారు. మేయర్ ఎన్నిక ప్రక్రియ రెండు నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు ఢిల్లీ మేయర్ ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమమయింది. ఎన్నికలు జరపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) చేసిన ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆమోదించారు. దీంతో నేడు ఉదయం పదకొండు గంటలకు మేయర్ ఎన్నిక జరగనుంది. ఆ తర్వాత డిప్యూటీ మేయర్, ఆరుగురు స్థాయీ సంఘం సభ్యుల (civic body)ఎన్నికలను కూడా నిర్వహిస్తారు. AAP, BJP మధ్య గలాటా నేపథ్యంలో డిసెంబర్లో ఎన్నికలు జరిగిన తర్వాత నుండి ఇప్పటి వరకు మూడుసార్లు వాయిదా పడింది మేయర్ ఎన్నిక. ఇది నాలుగోసారి. ఈ అంశంపై AAP అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన పది మంది సభ్యులను కూడా ఓటు వేసేందుకు అనుమతించారనే బీజేపీ వాదన పైన ఆమె కోర్టుకు వెళ్లారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్… బీజేపీకి షాకిచ్చింది. నామినేటెడ్ మెంబర్స్ ఓటు వేయవద్దని తీర్పు చెప్పింది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి విజయం. అత్యున్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో నామినేటెడ్ సభ్యులు ఓటింగ్లో పాల్గొనరు. వీరు ఓటు వేయకుంటే మేయర్ పదవిని ఆమ్ ఆద్మీ పార్టీ దక్కించుకుంటుంది.
కాబట్టి నేడు జరగబోయే మేయర్ ఎన్నికల్లో… నామినేటెడ్ సభ్యుల ఓటు ఉండదు కాబట్టి ఢిల్లీ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ దక్కించుకోవచ్చు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల తర్వాత ఆరుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఉంటుంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికలో ఆరుగురికి గాను ఆమ్ ఆద్మీ పార్టీ మూడు, బీజేపీ రెండు దక్కించుకుంటుంది. ఆరో సీటు పైన పైట్ ఉండనుంది. ఆల్డర్ మెన్ (నామినేటెడ్ సభ్యులు)కు అనుమతి ఉంటే బీజేపీ బలం 113 నుండి 123కు పెరుగుతుంది.
274 మెంబర్ హౌస్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 150 మంది మద్దతు ఉంది. మెజార్టీకి కావాల్సిన ఓట్లు 138. ఆల్డర్ మెన్ ఓటు ఉంటే స్టాండింగ్ కమిటీలో బీజేపీ సభ్యుల బలం పెరుగుతుంది. అలా జరగకుండా ఆమ్ ఆద్మీ పార్టీ కోర్టుకు వెళ్లింది.
మేయర్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. ఎలక్టోరల్ కాలేజీలో 250 ఎలెక్టెడ్ కౌన్సిలర్లు ఓటు వేస్తారు. ఏడుగురు లోకసభ సభ్యులు, ముగ్గురు రాజ్యసభ సభ్యులు, 14 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ 13 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను, ఒక బీజేపీ ఎమ్మెల్యేను సివిక్ బాడీ కోసం నామినేట్ చేశారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీ మేయర్ ఎన్నికలకు ముందు AAP-BJP మధ్య మరో వార్ మొదలైంది. స్నూపింగ్ ఆరోపణలపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కేంద్ర హోంశాఖ షాకిచ్చింది. ఫీడ్ బ్యాక్ యూనిట్ స్నూపింగ్ కేసులో అవినీతి నిరోధక చట్టం కింద ఆయనను విచారించేందుకు కేంద్ర హోం శాఖ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వంలోని వివిధ శాఖలు, అందులోని ఉద్యోగులు ఎలా పని చేస్తున్నారో సమాచారం సేకరించి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించేదే ఫీడ్ బ్యాక్ యూనిట్. 2015లో దీనిని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రూ.1 కోటి నిధులతో 2016 నుండి వర్క్ ప్రారంభించగా, ఇది 60 శాతం అవినీతికి సంబంధించి పని చేస్తే, 40 శాతం రాజకీయ అవసరాలకు ఉపయోగపడినట్లు సీబీఐ ఆరోపించింది. రూ.36 లక్షలు దీని కోసం దుర్వినియోగం చేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి.