»Will Contest From Visakhapatnam Lok Sabha Seat Again Says Vv Lakshminarayana
VV Lakshminarayana: అలాంటి పార్టీ టిక్కెటిస్తే ఓకే.. ఇవ్వకున్నా పోటీ మాత్రం పక్కా
తాను విశాఖ లోకసభ స్థానం (vishaka lok sabha) నుండి తాను స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని సీబీఐ (CBI) మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ (VV Lakshminarayana) మరోసారి స్పష్టం చేశారు.
తాను విశాఖ లోకసభ స్థానం (vishaka lok sabha) నుండి తాను స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని సీబీఐ (CBI) మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ (VV Lakshminarayana) మరోసారి స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ( visakhapatnam)స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పోటీ అంశంపై స్పందించారు. ఇతర పార్టీల నుండి పోటీ చేస్తారా.. ఆ పార్టీ అయితే ఏది అని మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ… తన ఆలోచనలకు దగ్గరగా ఉండే పార్టీ ఉంటే ఆలోచిస్తానని స్పష్టం చేశారు. ఏదైనా పార్టీకి తన ఆలోచనా విధానం వచ్చితే, వచ్చి చర్చలు జరిపితే సిద్ధమని చెప్పారు. తన ఆలోచన విధానం ఇప్పటికే స్పష్టం చేశానని గుర్తు చేశారు. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని పునరుద్ఘాటించారు. మన ఎన్నికల వ్యవస్థలో స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం ఉందని తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందన్నారు. గతంలో ఇక్కడి నుండి పోటీ చేసి, ఓడిపోయిన లక్ష్మీనారాయణ మరోసారి పోటీకి సిద్ధమని ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఎక్కడి నుండి పోటీ చేయాలనే అంశంపై ఆయన మొదటి నుండి చాలా క్లియర్ గా ఉన్నారు. విశాఖ నుండే పోటీ చేస్తానని చెబుతూ వస్తున్నారు. తాజాగా, ఇదే నగరం పరిధిలో మంగళవారం కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు జేడీ ఫౌండేషన్, ఐఏసీఈ సంయుక్తంగా ఇచ్చిన ఉచిత శిక్షణతో మంచి ఫలితాలు సాధించారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమానికి వచ్చారు లక్ష్మీనారాయణ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వెయ్యి మందికి తాము శిక్షణ ఇవ్వగా 98.2 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు దేహదారుడ్య పరీక్షల్లోను ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన లక్ష్మీనారాయణ తన రాజకీయ భవిష్యత్తుపై మరోసారి స్పందిస్తూ… విశాఖ నుండి పోటీ మాత్రం పక్కా అని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) విశాఖ లోకసభ నుండి గతంలో దగ్గుబాటి పురందేశ్వరి, ఎన్ జనార్ధన్ రెడ్డి, హరిబాబు తదితరులు పోటీ చేసి గెలిచారు. 2009లో పురందేశ్వరి కాంగ్రెస్ నుండి గెలిచారు. 2014లో తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జన సేన పొత్తు నేపథ్యంలో కమలం పార్టీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు విజయం సాధించారు. ఆయన వైసీపీ అధినేత జగన్ తల్లి విజయమ్మ పైన గెలుపొందడం అప్పుడు సంచలనంగా మారింది. అది కూడా 90వేల పై చిలుకు మెజార్టీతో విజయం సాధించారు. అయితే 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలిసారి గెలిచింది. ఆ పార్టీ నుండి ఎం వీ వీ సత్య నారాయణ టీడీపీ అభ్యర్థి భరత్ పైన విజయం సాధించారు.
2014లో టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేశాయి. 2019లో ఎవరికి వారు పోటీ చేయడంతో వైసీపీ స్వల్ప మెజార్టీతో గట్టెక్కింది. క్రితంసారి వీవీ లక్ష్మీనారాయణ… పవన్ కళ్యాణ్ పార్టీ నుండి పోటీ చేశారు. వైసీపీకి 4.36 లక్షల ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థికి 4.32 లక్షల ఓట్లు వచ్చాయి. జన సేన నుండి పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీకి 2.88 లక్షల పై చిలుకు ఓట్లు వచ్చాయి. ఎన్నికల తర్వాత ఆయన జనసేనానికి దూరం జరిగారు. ఈసారి ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా… తన ఆలోచనలకు అనుగుణంగా ఉండే పార్టీ టిక్కెట్ ఇస్తే పోటీ చేస్తానని చెబుతున్నారు. ఆయా పార్టీలకు అభ్యర్థులు ఉంటే ఇండిపెండెంట్గాను సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసిన భరత్ మళ్లీ పోటీకి సై అంటున్నారు. టీడీపీ – జనసేన పొత్తుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో… ఏమవుతుందో చూడాలి.