»Air India Newark Delhi Flight Emergency Landed In Stockholm
Air India విమానంలో ఆయిల్ లీక్.. ఆందోళనలో 300 మంది
అధికారులు వాస్తవ పరిస్థితిని తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రకటించింది. కాగా రెండు రోజుల వ్యవధిలో ఎయిర్ ఇండియాకు చెందిన రెండు విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఆ విమానం కూడా అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఎయిర్ ఇండియా (Air India) విమానం అత్యవసరం ల్యాండయ్యింది. 300 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం (Flight)లో ఆయిల్ లీక్ (Oil Leak) ఏర్పడింది. రెండో ఇంజన్ పని చేయకపోవడంతో అత్యవసరంగా కిందకు దిగింది. అమెరికాలోని నెవార్క్ నుంచి ఢిల్లీ (New Delhi) రావాల్సిన విమానం స్వీడన్ (Sweden)లోని స్టాక్ హోమ్ (Stockholm)లో అత్యవసరంగా దించారు. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు భయాందోళన చెందారు. ఆ తర్వాత అధికారులు వాస్తవ పరిస్థితిని తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రకటించింది. కాగా రెండు రోజుల వ్యవధిలో ఎయిర్ ఇండియాకు చెందిన రెండు విమానాల్లో సాంకేతిక లోపం (Technical Problem) తలెత్తింది. ఆ విమానం కూడా అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ విమానంలో తెలంగాణ, ఏపీకి చెందిన ప్రయాణికులు కూడా ఉన్నారని సమాచారం.
అమెరికా (USA)లోని నెవార్క్ (Newark)నుంచి ఎయిర్ ఇండియా విమానం (AI106) ఢిల్లీకి మంగళవారం (ఫిబ్రవరి 21) ఉదయం 11.35 గంటలకు బయల్దేరింది. మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం 11.35కు ఆ విమానం చేరుకోవాల్సి ఉంది. అయితే అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో విమానం సాంకేతిక కారణాలతో స్టాక్ హోమ్ లో నిలుపాల్సి వస్తుంది విమాన సిబ్బంది ప్రకటించింది. అయితే అకస్మాత్తుగా ఆయిల్ లీక్ మొదలవడంతో విమానంలోని రెండో ఇంజన్ ఆగిపోయింది. అప్రమత్తమైన విమాన సిబ్బంది ఎయిర్ ఇండియాకు సమాచారం అందించారు. వారి ఆదేశాల మేరకు స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో అత్యవసరంగా ల్యాండింగ్ కు అవకాశం ఇచ్చారు. విమానంలోని 300 మంది ప్రయాణికుల్లో దాదాపు 40 మంది తెలుగు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
విమానం అంతరాయంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉన్న విమానాలను అందుకోలేకపోయామని వాపోయారు. కాగా ఎయిర్ ఇండియా విమానం రెండు రోజుల వ్యవధిలో ఇది రెండో సంఘటన జరిగింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీ చేరుకోవాల్సిన విమానం కూడా అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వైద్యపరమైన అత్యవసరం ఉండడంతో విమానాన్ని దారి మళ్లించి లండన్ లో దింపారు.