ASR: జీకేవీధి మండలం సీలేరు అటవీ రేంజ్ పరిధి సప్పర్ల రెయిన్ గేజ్ వద్ద పులి సంచారం నిజమేనని అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. ఇటీవల సప్పర్ల రెయిన్ గేజ్ వద్ద పులి రోడ్డు దాటుతూ కనిపించిందని వార్తలు వచ్చాయి. దీంతో గురువారం సీలేరు రేంజ్ అధికారి వెంకటేశ్వరావు సిబ్బందితో పులి కనిపించిన ప్రదేశానికి వెళ్లగా, పాదముద్రలు కనిపించాయి. దానిని చిరుతపులిగా గుర్తించారు.