యాషెస్ 3వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 286 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ స్టోక్స్(83), బ్రూక్(45) మినహా ఎవరూ రాణించకపోవడంతో.. ఇంకా 85 రన్స్ వెనుకంజలో ఉంది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. కాగా తొలి ఇన్నింగ్స్లో కంగారూలు 371 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి 2 టెస్టులు ఓడిన ENGకు.. సిరీస్ కాపాడుకోవడానికి ఈ మ్యాచ్ కీలకం.