ATP: జిల్లాకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం మొదటి విడత నిధులు రూ. 34.17 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో రూ. 20.50 కోట్లు టైడ్ నిధులు కాగా, రూ. 13.66 కోట్లు బేసిక్ నిధులుగా ఉన్నాయి. ఈ నిధులను నిబంధనల మేరకు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలని జిల్లా డీపీఓ నాగరాజు నాయుడు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.