మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇవాళ పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు చెన్నూర్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ భవన్ ప్రారంభోత్సవం చేయనున్నారు. 10 గంటలకు చెన్నూర్‌లో నూతనంగా నిర్మించిన కూరగాయలు మార్కెట్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లను సన్మానించనున్నారు.