E.G: ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. గురువారం కోరుకొండలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏపీఆర్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.