VZM: బొబ్బిలి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం గంజాయితో ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని తనిఖీ చేయగా బ్యాగుల్లో రెండు కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులు పవన్ కుమార్, మెహన్ శ్యామ్లను అరెస్ట్ చేశారు. గంజాయి విక్రయం, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సతీష్ కుమార్ హెచ్చరించారు.