»Drunk And Drivers Cleans Rk Beach As Punishment In Visakhapatnam
Drunk and Drive తాగుబోతులకు సముద్రంలో శిక్ష.. దెబ్బకు మత్తు దిగింది
వాహనదారులకు జరిమానా విధిస్తే మార్పు రావడం లేదని కోర్టు భావించింది. వారిలో పరివర్తన రావాలనే ఉద్దేశంతో వారికి బాధ్యత తెలియాలనే ఉద్దేశంతో బీచ్ క్లీనింగ్ శిక్ష విధించింది. జరిమానాల వలన ఒరిగిదేమిటి లేదు. ఇలాంటి శిక్షల ద్వారా వారిలో మార్పులు వస్తుందని భావిస్తున్నా. వీటితో పాటు హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారికి కూడా అవగాహన కల్పిస్తున్నాం.
ఒకసారి చెబుతారు.. రెండుసార్లు చెబుతారు. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మారకపోతే చెప్పే విధానంలో మార్పు వస్తుంది. మాటలతో కాదు.. చేతలకు పని చెప్పాల్సి వస్తుంది. అలాంటి పనినే న్యాయవాదులు చేశారు. కోర్టు దెబ్బకు వారి మత్తు వదిలింది.. ఏపీలోని విశాఖపట్టణం (Visakhapatnam)లోని సముద్రం శుభ్రమైంది. ఇంతకీ ఏమిటని అనుకుంటున్నారా? తాగుబోతుల (Drunkers)కు విశాఖపట్టణం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు వింత శిక్ష విధించింది. మద్యం తాగుతూ వాహనాలు నడిపిన వారికి సముద్రం ఒడ్డున శుభ్రత కార్యక్రమం చేయాలని తీర్పు ఆదేశించింది. దీంతో మద్యం పట్టిన చేతులే ఇప్పుడు చెత్తను పట్టాయి. తాగుబోతులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. చట్టాలు ఉన్నా వాటిని అతిక్రమిస్తున్నారు. తప్ప తాగి రోడ్ల మీదకు రావొద్దంటే వస్తున్నారు. వీరికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో కోర్టు ఈ తీర్పునిచ్చింది.
విశాఖపట్టణంలో ఈనెల 17, 18వ తేదీన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు (Vehicles) నడిపే వారిని తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఏకంగా 52 మంది మద్యం సేవించి వాహనాలు నడిపారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకునే క్రమంలో కొందరు వాహనదారులతో వాగ్వాదం ఏర్పడింది. వారిని పంపించి వాహనాలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. తెల్లవారుజామున స్టేషన్ లో విచారించి వారిని విశాఖపట్టణం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు (Visakhapatnam Metropolitan Magistrate)లో హాజరుపరిచారు. అయితే తాగుబోతుల్లో పరిస్థితి మార్పు రాకపోవడంతో మెజిస్ట్రేట్ అసహనం వ్యక్తం చేశారు. వీళ్లకు ఇలాగైతే కాదని విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్ ను శుభ్రం చేయాలని తీర్పునిచ్చారు. మెజిస్ట్రేట్ ఆదేశాలతో తాగుబోతులు సోమవారం ఆర్కే బీచ్ కు చేరుకుని ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలు తీశారు.
ఈ సందర్భంగా సీఐ తులసీ దాస్ (Tulasi Das) మాట్లాడుతూ.. ‘హర్బర్, త్రీ టౌన్, ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ లలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాం. అయితే మద్యం తాగి వాహనాలు నడిపిన 52 మందిని కోర్టులో హాజరుపరిచాం. వాహనదారులకు జరిమానా విధిస్తే మార్పు రావడం లేదని కోర్టు భావించింది. వారిలో పరివర్తన రావాలనే ఉద్దేశంతో వారికి బాధ్యత తెలియాలనే ఉద్దేశంతో బీచ్ క్లీనింగ్ శిక్ష విధించింది. జరిమానాల వలన ఒరిగిదేమిటి లేదు. మద్యం తాగి వాహనాలు నడిపితే ప్రమాదాల బారిన పడుతారని చెబుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇలాంటి శిక్షల ద్వారా వారిలో మార్పులు వస్తుందని భావిస్తున్నా. వీటితో పాటు హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారికి కూడా అవగాహన కల్పిస్తున్నాం. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే వాహనదారులు క్షేమంగా ఇంటికి వెళ్తారు. ఈ విషయాన్ని గమనిస్తే ప్రమాద రహిత విశాఖ తయారవుతుంది’ అని పేర్కొన్నారు.
#Vizag Metropolitan Magistrate's Court ordered 52 drunk drivers to clean up the garbage from RK beachside as punishment, they were asked to pick up the trash till evening. pic.twitter.com/3XwnAUe5aG