»Why Still Im Single Dont Know Says Rahul Gandhi In Italian Paper Interview
Marriage: ఒంటరితనం భరించలేకపోతున్న రాహుల్ గాంధీ.. మరోసారి పెళ్లి వ్యాఖ్యలు
భారత్ జోడో యాత్ర పేరిట రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుదీర్ఘ యాత్ర చేపట్టాడు. నిస్తేజంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపాడు. సోనియా గాంధీ ఇటలీ దేశస్తురాలు. సోనియా తల్లి పావ్ లామాయినో ఇంకా జీవించి ఉన్నారు. అందుకే అప్పుడప్పుడు రాహుల్ ఇటలీకి వెళ్తుంటాడు.
కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్ర నాయకుడు.. సోనియా గాంధీ (Sonia Gandhi) కుమారుడు.. దేశంలోనే అతి పెద్ద బ్రహ్మచారిగా గుర్తింపు పొందిన రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఒంటరితనం భరించలేకపోతున్నాడు. 52 ఏళ్ల వయసులో అతడికి పెళ్లిపై ఆలోచనలు మొదలయ్యాయి. తరచూ ఆ విషయమై మీడియా ముందు ప్రస్తావిస్తున్నాడు. తాజాగా మరోసారి వివాహం చేసుకోవాలని ఉందని ప్రకటించాడు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్రలో పలుసార్లు పెళ్లి విషయాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు తనకు పిల్లలు కావాలని ఉందని వ్యాఖ్యానించాడు. ఒక ఇటలీ దేశానికి చెందిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ (Interview)లో రాహుల్ గాంధీ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన నాన్నమ్మ ఇందిరాగాంధీతోపాటు తల్లి సోనియాగాంధీ, సోదరి ప్రియాంక గాంధీ విషయాలపై స్పందించాడు.
ఇటలీకి చెందిన కొరియెర్ డెల్లా సెరా (Corriere della Sera) అనే పత్రిక చేసిన ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. ‘నేనంటే మా నాన్నమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఎంతో ఇష్టం. ఇక ప్రియాంక అంటే మా అమ్మమ్మ పావ్ లామాయినో (Paola Maino)కు ఇష్టం’ అని తెలిపాడు. ఇక 52 ఏళ్లు వచ్చినా పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే అంశంపై ప్రశ్నించగా.. ‘ఆ విషయం నాకే విచిత్రంగా ఉంది. ఇంకా సింగిల్ గా ఎందుకు ఉన్నానో తెలియదు. పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలియదు. కానీ నాకు పిల్లలు కావాలని ఉంది. ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది. మా నాన్న హత్యపై ముందస్తు సమాచారం ఉంది. కానీ అయినా ప్రాణాలు కోల్పోయాడు’ అని రాహుల్ భావోద్వేగానికి లోనయ్యాడు.
ఇక ‘భారత్ జోడో యాత్ర‘ (Bharat Jodo Yatra) గురించి మాట్లాడుతూ..‘యాత్ర నాకు ఒక తపస్సు లాంటిది. విజయవంతంగా పూర్తి చేశా. యాత్ర పూర్తయ్యే వరకు గడ్డం తీయరాదని అనుకున్నా. ప్రస్తుతం గడ్డం ఉంచాలా లేదా తీసివేయాలా అనేది నిర్ణయించుకోవాలి. వాస్తవ సమస్యలను తప్పుదోవ పట్టించుకోవడం హిందూ ముస్లిం సమస్య తీసుకువస్తున్నారు. కానీ ప్రాధాన్యం మాత్రం పేదరికం, ద్రవ్యోల్బణం సమస్యలపైనే. దేశంలో నియంతృత్వం కొనసాగుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ప్రజాస్వామ్యం ఎక్కడా కొనసాగడం లేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పని చేయడం లేదు’ అని రాహుల్ తెలిపాడు.
2024 సాధారణ ఎన్నికలపై స్పందిస్తూ.. ‘శాంతి, ఐకమత్యంతో ఉంటేనే విపక్షాలు బీజేపీని విజయవంతంగా ఓడించవచ్చు. 2024 ఎన్నికల్లో వంద శాతం విపక్ష పార్టీలు బీజేపీని ఓడిస్తాయి’ అని తెలిపిన రాహుల్ అంతర్జాతీయ సంబంధాలపై స్పందించాడు. రష్యా- ఉక్రెయిన్ పై స్పందించేందుకు నిరాకరించిన రాహుల్ శాంతిపూర్వక పరిష్కారం రావాలని మాత్రం అభిలషించాడు. భారత్ జోడో యాత్ర పేరిట రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుదీర్ఘ యాత్ర చేపట్టాడు. నిస్తేజంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపాడు. సోనియా గాంధీ ఇటలీ దేశస్తురాలు. సోనియా తల్లి పావ్ లామాయినో ఇంకా జీవించి ఉన్నారు. అందుకే అప్పుడప్పుడు రాహుల్ ఇటలీకి వెళ్తుంటాడు.