సామాజిక మాధ్యమాలు ఇలా వసూళ్ల దందాకు తెరలేపాయి. ప్రజలను సామాజిక మాధ్యమాలను వినియోగించుకునేలా అలవాటు చేసిన సంస్థలు ఇప్పుడు అదే ప్రజలను పీల్చుకు తినేలా చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లేనిది ప్రజలు ఉండలేకపోతున్నారు. సోషల్ మీడియా మాయలో పడి తమ జీవనశైలినే ప్రజలు మార్చుకున్నారు. గంటల కొద్దీ సామాజిక మాధ్యమాల్లో ఉంటూ వృత్తి, వ్యక్తిగత పనులపై శ్రద్ధ కనబర్చలేకపోతున్నారు. ఒక వ్యసనంలా సోషల్ మీడియా వినియోగం మారింది.
ప్రస్తుతం దిగ్గజ సంస్థలు కొత్త ఆదాయ అన్వేషణ మార్గాలను చూస్తున్నాయి. ఆదాయ మార్గాలు ఎక్కడ ఉన్నాయని తీవ్రంగా అన్వేషిస్తున్నాయి. వినియోగదారుల జోలికి రాకుండా సంస్థలు తమ ఆదాయ మార్గాలు చూసుకున్నాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఇన్నాళ్లు తమకు అండగా ఉన్న వినియోగదారులను ఇప్పుడు ఆదాయ వనరుగా వాడుకోవడం మొదలుపెట్టారు. వినియోగదారుల నుంచే వసూళ్లకు తెర తీశారు. తమ అత్యుత్తమ సేవలు పొందేందుకు ఇకపై వినియోగదారులు కాసులు చెల్లించాల్సిందే. ఈ మేరకు ఆయా సంస్థలు తమ ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. దీనికి ట్విటర్ (Twitter) నాంది పలకగా.. ఇప్పుడు ఫేసుబుక్ (Facebook), ఇన్ స్టాగ్రామ్ (Instagram) అదే దారిలోకి వచ్చాయి.
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ (Elan Musk) ట్విటర్ కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి తల తిక్క నిర్ణయాలతో ట్విటర్ మనుగడనే ప్రశ్నార్థకంగా చేశాడు. అయితే ప్రస్తుతం ట్విటర్ సేవలు డబ్బులతో ముడిపడ్డాయి. సాధారణంగా ట్విటర్ వినియోగించుకోవచ్చు. కానీ అత్యుత్తమ సేవలు.. సామాజిక గుర్తింపు దక్కాలంటే నెలకు ప్రీమియం (Premium) మాదిరి చెల్లించాలి. దీనికి ఎలన్ మస్క్ తెర తీయగా.. ఇప్పుడు అదే బాటలో ఫేసుబుక్ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) చేరాడు. త్వరలో ఫేస్బుక్ బ్లూటిక్ హోల్డర్ల (Blue Tick Holders)కు ప్రతి నెలా చార్జీలు (Charges) చెల్లించాలని జుకర్ బర్గ్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు ఫేస్బుక్లో జుకర్ బర్గ్ ప్రకటన చేశాడు.
ప్రభుత్వ ఐడీలతో ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్ బ్లూ టిక్ హోల్డర్ల అకౌంట్ల పరిశీలన ఉంటుందని ప్రకటనలో తెలిపాడు. మొదట ఆస్ట్రేలియా (Australia), న్యూజిలాండ్ (New Zealand)లో ఈ వెరిఫికేషన్ చార్జీల అమలు చేయనున్నారు. వినియోగదారుల స్పందన బాగుంటే ఆ వెంటనే మిగతా దేశాల్లో కూడా ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్ బ్లూటిక్ యూజర్ చార్జీలు వసూళ్లు చేయనున్నారు. అయితే ఐఓఎస్ యూజర్ల నుంచి నెలకు 14.99 డాలర్లు (దాదాపు రూ.1,239), వెబ్ యూజర్ల నుంచి నెలకు 11.99 డాలర్లు (దాదాపు రూ.991) వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే తాజా నిర్ణయంతో నకిలీ ఖాతాలను గుర్తించి వాటిని తొలగించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని జుకర్ బర్గ్ పేర్కొన్నాడు. ప్రకటనల మీద వస్తున్న ఆదాయం చాలక ఈ చార్జీల రూపంలో మరో ఆదాయం ఫేసుబుక్, ఇన్ స్టాగ్రామ్ పొందనుంది.
సామాజిక మాధ్యమాలు ఇలా వసూళ్ల దందాకు తెరలేపాయి. ప్రజలను సామాజిక మాధ్యమాలను వినియోగించుకునేలా అలవాటు చేసిన సంస్థలు ఇప్పుడు అదే ప్రజలను పీల్చుకు తినేలా చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లేనిది ప్రజలు ఉండలేకపోతున్నారు. సోషల్ మీడియా మాయలో పడి తమ జీవనశైలినే ప్రజలు మార్చుకున్నారు. గంటల కొద్దీ సామాజిక మాధ్యమాల్లో ఉంటూ వృత్తి, వ్యక్తిగత పనులపై శ్రద్ధ కనబర్చలేకపోతున్నారు. ఒక వ్యసనంలా సోషల్ మీడియా వినియోగం మారింది. ప్రస్తుతం చార్జీలు వసూళ్లు చేస్తుండడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వసూళ్లు కూడా ఒక విధంగా మంచికే అని భావిస్తున్నారు. డబ్బులు చెల్లించాల్సి వస్తుండడంతో కొంత సోషల్ మీడియాను పరిమితంగా వాడే అవకాశం ఉంటుంది.