»Facebook Instagram Meta Ceo Mark Zuckerberg Underground Bunker In Kauai Hawaiian Island
Mark Zuckerberg: మార్క్ జుకర్ బర్గ్ కు ప్రాణాపాయం.. రూ.2100 కోట్లతో బంకర్ నిర్మాణం
ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్ యజమాని మార్క్ జుకర్‌బర్గ్‌కు తలెత్తిన ముప్పు ఏమిటి ? ఈ వార్త ప్రతి ఒక్కరి మదిలో మెదులుతోంది. కారణం మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ హవాయి ద్వీపంలో సుమారు 260 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2100 కోట్లు)తో భూగర్భ బంకర్‌ను నిర్మిస్తున్నారని మీడియాలో వచ్చిన వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
Mark Zuckerberg: ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్ యజమాని మార్క్ జుకర్‌బర్గ్‌కు తలెత్తిన ముప్పు ఏమిటి ? ఈ వార్త ప్రతి ఒక్కరి మదిలో మెదులుతోంది. కారణం మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ హవాయి ద్వీపంలో సుమారు 260 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2100 కోట్లు)తో భూగర్భ బంకర్‌ను నిర్మిస్తున్నారని మీడియాలో వచ్చిన వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఇది బాంబు పేలుళ్లు లేదా రసాయన దాడుల ద్వారా కూడా ప్రభావితం కాదు. ఈ బంకర్ నిర్మాణానికి సంబంధించిన చిన్న చిన్న వివరాలు కూడా ప్రపంచానికి తెలియకుండా చాలా కఠినమైన నిబంధనలు అమలయ్యాయి.
ఫేస్బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ హవాయి ద్వీపంలో ఈ ఎస్టేట్‌ను దశాబ్దం క్రితం కొనుగోలు చేసాడు. అప్పటి నుండి దాని నిర్మాణ పనులు చాలా నిశ్శబ్దంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జుకర్‌బర్గ్ ఈ స్థలం గురించి లేదా దానిపై నిర్మించిన బంకర్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. దీనిలోకి బయటి వ్యక్తుల రాకను పూర్తిగా నిషేధించారు. అత్యంత దుర్భేద్యంగా ఉండేలా దాదాపు దశాబ్దకాలంగా ఈ బంకర్ నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేశారని వివరించింది. 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భూగర్భ బంకర్‌ను నిర్మిస్తున్నారని పేర్కొంది. ఈ బంకర్‌కు స్వయంగా విద్యుత్, ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉందని న్యూస్‌డాట్‌కామ్‌ఏయూ (news.com.au) కథనం పేర్కొంది. ఇందుకోసం ఏకంగా 260 మిలియన్ డాలర్లను ఖర్చుపెడుతున్నారని కథనం పేర్కొంది. బంకర్ నిర్మాణం గురించి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన నిర్మాణ కార్మికులను పనిలో నుంచి తీసేసినట్టు ‘వైర్డ్’ కథనం పేర్కొంది. అక్కడ పనిచేస్తున్న కొందరు వ్యక్తులను సంప్రదించగా ఈ విషయం తెలిసిందని వెల్లడించింది. నిర్మాణానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయవద్దంటూ ఒప్పందాలు కుదుర్చుకొని పనిలోకి తీసుకున్నారని, నిర్మాణ ప్రదేశంలో ఫొటో కూడా తీసే పరిస్థితిలేదని ఓ కార్మికుడి చెప్పినట్టుగా ‘వైర్డ్’ కథనం ఊటంకించింది.
హవాయి ద్వీపానికి చెందిన కాయై అనేక ప్రసిద్ధ హాలీవుడ్ చిత్రాల షూటింగ్లో వార్తల్లో నిలిచింది. ఈ చిత్రాలలో పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్, జురాసిక్ పార్క్ వంటి చిత్రాలు ఉన్నాయి. కాయైలో దాదాపు 73,000 జనాభా ఉంది. ఇందులో హవాయి దీవుల స్థానిక తెగలతో పాటు చైనీస్, ప్యూర్టో రికన్, ఫిలిపినో మూలాలకు చెందిన వలసదారులు ఉన్నారు. 19వ శతాబ్దంలో చెరకు సాగు ప్రారంభించి ఇక్కడ స్థిరపడ్డప్పుడు పని కోసం ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు వారే ఇక్కడ ప్రధాన జనాభా.