»Man Arrested For Selling Sacrificial Goats With Plastic Teeth In Pakistan Karachi
Pakistan : జనాల్లో బక్రీద్ ఉత్సాహం.. జోరుగా ప్లాస్టిక్ పళ్లు పెట్టిన మేకల విక్రయం
నిత్యం ఏదో ఒక వివాదం కారణంగా పాకిస్థాన్ ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. కొన్నిసార్లు తీవ్రవాదానికి మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై మరి కొన్నిసార్లు వారి ఆర్థిక పరిస్థితి కారణంగా ప్రతి రోజు ముఖ్యాంశాల్లో నిలుస్తోంది.
Pakistan : నిత్యం ఏదో ఒక వివాదం కారణంగా పాకిస్థాన్ ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. కొన్నిసార్లు తీవ్రవాదానికి మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై మరి కొన్నిసార్లు వారి ఆర్థిక పరిస్థితి కారణంగా ప్రతి రోజు ముఖ్యాంశాల్లో నిలుస్తోంది. కాగా, బక్రీద్ సందర్భంగా పాకిస్థాన్లో ప్లాస్టిక్ పళ్లతో కూడిన మేకలను విక్రయిస్తున్నట్లు ప్రముఖ మీడియా వెల్లడించింది. గుల్బర్గ్ చౌరింఘీ ప్రాంతంలో బలి మేకలను ప్లాస్టిక్ పళ్లతో విక్రయిస్తున్న వ్యాపారిని కరాచీలోని అధికారులు శనివారం అరెస్టు చేశారు.
అసలు విషయం ఏమిటి?
ఓ కస్టమర్ మేకకు ప్లాస్టిక్ పళ్లను తొలగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత మేకల వ్యాపారిని అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యాపారి హైదరాబాద్ నివాసి, బక్రీద్ కోసం జంతువులను విక్రయించేందుకు కరాచీకి వచ్చాడు. పోలీసుల విచారణలో ప్లాస్టిక్ పళ్లతో మేకల విక్రయానికి పాల్పడుతున్నట్లు అంగీకరించాడు. ఈ సందర్భంగా పోలీసులు 7 మేకలు, గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు. ‘సోషల్ మీడియాలో హల్చల్ చేసిన వీడియోలో ప్లాస్టిక్ పళ్లతో మేకలను విక్రయిస్తున్నట్లు గుర్తించామని.. దీంతో ఆ వ్యాపారిని అరెస్ట్ చేశాం’ అని ఓ పోలీసు అధికారి స్పష్టం చేశారు.
Pak man arrested for selling sacrificial goat with plastic teeth
బక్రీద్ జూన్ 17న కావడం గమనార్హం. ఇది ముస్లింల పండుగ, ఇందులో వారు జంతువులను బలి ఇవ్వడం ద్వారా దేవునికి విధేయత చూపిన ప్రవక్త ఇబ్రహీంను గుర్తు చేసుకుంటారు. ఈ తర్వాత మాంసాన్ని సాంప్రదాయకంగా కుటుంబం, ప్రజలతో పంచుకుంటారు. ప్రవక్త ఇబ్రహీం కథ ఆధారంగా ఈ సంప్రదాయం ఈద్ వేడుకల సందర్భంగా మూడు రోజుల పాటు జంతువులను బలి ఇస్తారు.