NRML: రికగ్నైజ్ద్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్రం జిల్లా అధ్యక్షుడిగా గంగాధర్ రావు, ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వర్లను నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు నరసింహులు నియామక పత్రం శనివారం అందజేశారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడుతూ.. భాషా పండితుల ఉపాధ్యాయులను ఏకం చేసి యూనియన్ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.