»Telangana Gland Pharma To Invest Rs 400 Crore For Expand Plant In Genome Valley
Telanganaకు మరో భారీ పెట్టుబడి.. కేటీఆర్ హర్షం
పెట్టుబడుల ప్రకటన మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది భిన్నంగా స్పందించారు. ‘తెలంగాణలో ఉన్న సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరిస్తుండడం.. కొత్త పెట్టుబడులు రావడం జరుగుతుంటే పక్క రాష్ట్రంలో మాత్రం ఉన్న సంస్థలు మూతపడుతున్నాయి.. కొత్త సంస్థలు రావడం లేదు’ అని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ గుడ్డు చుట్టూ తిరుగుతున్నాడని ఓ నెటిజన్ ఎద్దేవా చేశాడు.
భారతదేశంలో పెట్టుబడు (Investments)లకు స్వర్గధామంగా తెలంగాణ రాష్ట్రం (Telangana) నిలుస్తోంది. దావోస్ (Davos) లో జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో దాదాపు రూ.30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన తెలంగాణ ప్రస్తుతం మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తోంది. దావోస్ లో జరిగిన చర్చలు ఫలించి నేరుగా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సంస్థలు మరిన్ని పెట్టుబడులు పెడుతున్నాయి. తమ సంస్థ కార్యకలాపాలను తెలంగాణలో మరింత విస్తరించేందుకు చూస్తున్నాయి. తాజాగా మరో సంస్థ తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ మరో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్ (Hyderabad) శివారులోని జీనోమ్ వ్యాలీ (Genome Valley) లో ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లాండ్ ఫార్మా (Gland Pharma) కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. తాజాగా రూ.400 కోట్ల రూపాయల పెట్టుబడితో కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు వెల్లడించింది. ఈ పెట్టుబడి ద్వారా 500 మందికి పైగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని వివరించింది. ఈ మేరకు ప్రగతిభవన్ లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను గ్లాండ్ ఫార్మా సీఈఓ, ఎండీ శ్రీనివాస్ సాదు కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన గ్లాండ్ ఫార్మాకు మంత్రి కేటీఆర్ (KTR) స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ను శాలువాతో సత్కరించి అభినందించారు.
జీనోమ్ వ్యాలీలో గ్లాండ్ ఫార్మా తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని ప్రకటించడంపై తనకు చాలా సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడి ప్రకటన చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర లైఫ్ లైన్సైస్ (జీవశాస్త్ర), జీనోమ్ వ్యాలీల శక్తి నిత్యం బలోపేతమవుతోంది’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ కూడా ఉన్నారు. జీనోమ్ వ్యాలీలో వైద్య సంబంధిత పరిశ్రమలకు పెట్టింది పేరు. కరోనా సమయంలో జీనోమ్ వ్యాలీలోనూ ఆయా సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగాయి. తెలంగాణ ఫార్మా హబ్ గా ఏర్పడడంలో జీనోమ్ వ్యాలీ కీలక పాత్ర పోషించింది.
ఏపీ ఐటీ మంత్రికి కౌంటర్
కాగా పెట్టుబడుల ప్రకటన మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది భిన్నంగా స్పందించారు. ‘తెలంగాణలో ఉన్న సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరిస్తుండడం.. కొత్త పెట్టుబడులు రావడం జరుగుతుంటే పక్క రాష్ట్రంలో మాత్రం ఉన్న సంస్థలు మూతపడుతున్నాయి.. కొత్త సంస్థలు రావడం లేదు’ అని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ గుడ్డు చుట్టూ తిరుగుతున్నాడని ఓ నెటిజన్ ఎద్దేవా చేశాడు. ఎప్పుడు పొదుగుతుంది.. ఎప్పుడు పిల్ల పుడుతుందని వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.