»Yadadri Brahmotsavams 2021 Starts From Feb 21 To March 3rd
Yadadri Brahmotsavams రేపటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. సీఎం కేసీఆర్ రాక
ఆలయ పున:నిర్మాణం తర్వాత జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు ఆలయ పాలక మండలి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం వారాంతాల్లో భక్తులు భారీగా వస్తున్నారు. ఇక ఉత్సవాలకు ఆలయం కిటకిటలాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు సరిపడా ఏర్పాట్లు ఉండేందుకు పాలక మండలి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టింది.
తెలంగాణ ఆలయ నగరి యాదాద్రి బ్రహ్మోత్సవాల (Yadadri Brahmotsavams)కు ముస్తాబైంది. పున:నిర్మాణం తర్వాత యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి (Yadadri Laxmi Narasimha Swamy) ఆలయ వార్షికోత్సవాలు తొలిసారి జరుగనున్నాయి. ఉత్సవాల కోసం ఆలయ పరిసరాలు సర్వాంగ సుందరంగా మారాయి. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు మార్చి 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధనతో మొదలయ్యే బ్రహ్మోత్సవాలు డోలోత్సవంతో ముగుస్తాయి. అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ పాలక మండలి ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఆలయ పాలకమండలి ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో నిత్యం జరిగే ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను రద్దు చేశారు.
ఆలయ పున:నిర్మాణం తర్వాత జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు ఆలయ పాలక మండలి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం వారాంతాల్లో భక్తులు భారీగా వస్తున్నారు. ఇక ఉత్సవాలకు ఆలయం కిటకిటలాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు సరిపడా ఏర్పాట్లు ఉండేందుకు పాలక మండలి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టింది. లడ్డూ ప్రసాదాలు కొరత ఏర్పడకుండా.. దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోనుంది. ఇక ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా యాదాద్రీశుడు వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ప్రత్యేక పూజల అనంతరం వివిధ వాహనాలపై లక్ష్మీ నర్సింహస్వామి భక్తులకు దర్శనమిస్తారు. కొండ కింద, పైన భక్తులకు సకల ఏర్పాట్లు కల్పిస్తున్నారు. ఆర్టీసీతో సమన్వయం చేసుకుని హైదరాబాద్ తో పాటు వరంగల్, నల్లగొండ, మెదక్ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపే అవకాశం ఉంది.
సీఎం కేసీఆర్ రాక
బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం. ఈనెల 28వ తేదీన జరుగనున్న కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి సతీసమేతంగా హాజరయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం తరఫున స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. హెలికాప్టర్ లో వచ్చే అవకాశం ఉండడంతో హెలిప్యాడ్ సిద్ధం చేయనున్నారు. ఆయన వెంట దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తరలి రానున్నారు.
ఉత్సవాలు
– 21న ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తీవాచరం, రక్షాబంధనం
సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురార్పణ
– 22న ఉదయం 8 గంటలకు అగ్ని ప్రతిష్ట, 11 గంటలకు ధ్వజారోహణం.
సాయంత్రం 6 గంటలకు భేరీ పూజ, దేవతాహ్వాన హనం
– 23న ఉదయం 9 గంటలకు మత్య్సావతార అలంకార సేవ, వేద పారాయణం
సాయంత్రం 7గంటలకు శేష వాహన సేవ.
– 24న ఉదయం 9 గంటలకు వటపత్రశాయి అలంకార సేవ
సాయంత్రం 7 గంటలకు హంస వాహన సేవ
– 25న ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణాలంకార సేవ
సాయంత్రం 7 గంటలకు పొన్న వాహన సేవ
– 26న ఉదయం 9 గంటలకు గోవర్ధన గిరిధారి అలంకార సేవ
సాయంత్రం 7 గంటలకు సింహ వాహన సేవ
– 27న ఉదయం 9 గంటలకు జగన్మోహిని అలంకార సేవ
సాయంత్రం 7 గంటలకు అశ్వవాహన సేవ, ఎదుర్కోలు ఉత్సవం
– 28న ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకార హనుమంత వాహన సేవ
సాయంత్రం 8 గంటలకు గజవాహన సేవ, తిరు కల్యాణోత్సవం
– మార్చి 1న ఉదయం 9 గంటలకు గరుడ వాహన సేవ
సాయంత్రం 7 గంటలకు దివ్య విమాన రథోత్సవం
– 2న ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం
సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం, దేవతోద్వాసన
– 3న ఉదయం 10 గంటలకు అష్టోత్తర శతఘాటాభిషేకం
రాత్రి 9 గంటలకు డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.