»Telagana Govt Allotted Land To Boxer Nikhat Zareen In Jubilee Hills
Boxing: చాంపియన్ కు తెలంగాణ భారీ కానుకలు.. రూ.20 కోట్ల స్థలం
తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారు (Sportsmen)లకు పెద్ద పీట వేస్తోంది. ఇటీవల భారత షూటర్ ఇషాసింగ్ (Esha Singh) కు కూడా స్థలం పత్రాలను ఇచ్చారు. గతంలోనూ సానియా మీర్జా, పీవీ సింధు తదితరులకు తెలంగాణ ప్రభుత్వం భారీ నగదు బహుమతితో పాటు ఉద్యోగాలను ప్రకటించింది. ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఈ మేరకు క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నది.
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ (Telangana) సత్తాను చూపించి ప్రపంచ చాంపియన్ (World Champion)గా నిలిచన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ (Nikhat Zareen)కు తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) భారీ కానుకలు ఇచ్చింది. గతేడాది టర్కీ (Turkey)లో జరిగిన అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్ లో నిఖత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుస్తున్న ఈ నిజామాబాద్ అమ్మాయికి తెలంగాణ ప్రభుత్వం గతంలోనే గ్రూప్-1 క్యాడర్ ఉద్యోగం, హైదరాబాద్ లో ఇంటి స్థలం బహుమానంగా ఇస్తామని ప్రకటించింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం దానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసింది.
హైదరాబాద్ లో తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ (V Srinivas Goud) ఇంటి స్థలానికి (Land Documents) సంబంధించిన పత్రాలను సోమవారం నిఖత్ తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ కు అందించారు. డీఎస్పీ (DSP) ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రాలను త్వరలోనే అందిస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన నికత్ జరీన్ కు జూబ్లీహిల్స్ లో 600 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించినట్లు వెల్లడించారు. ‘అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ పోటీల్లో నిఖత్ స్వర్ణ పతకం గెలుపొంది తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప విజయాలు సాధించిన తెలంగాణ బిడ్డలను సీఎం కేసీఆర్ (KCR) సమున్నతంగా గౌరవిస్తున్నారు. ఇందులో భాగంగానే రూ. కోట్ల నగదు బహుమతితో పాటు జూబ్లీహిల్స్ లో నివాసయోగ్యమైన ఇంటి స్థలం అందించాం. నిఖత్ మరిన్ని విజయాలు సాధించాలి’ అని మంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సహాయానికి నిఖత్ తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహంతో తన బిడ్డ నిఖత్ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాగా నిఖత్ జరీన్ కు అత్యంత ఖరీదైన ప్రాంతం జూబ్లీహిల్స్ (Jubilee Hills) లో ప్రభుత్వం స్థలం కేటాయించింది. 600 గజాల స్థలం విలువ దాదాపు రూ.20 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తున్నది. గతేడాది మే 19న ఇస్తాంబుల్ లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో 52 కిలోల విభాగం సింగిల్స్ లో నిఖత్ పాల్గొన్నది. ఫైనల్ పోరులో తన పంచ్ లతో నిఖత్ థాయిలాండ్ బాక్సర్ జిట్ పాంగ్ జుటమస్ ను మట్టి కరిపించింది. స్వర్ణ పతకం కొల్లగొట్టి ప్రపంచ చాంపియన్ గా అవతరించింది. అనంతరం జాతీయంగా జరిగిన అనేక చాంపియన్ షిప్ లలో నిఖత్ విజేతగా నిలిచింది.
కాగా తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారు (Sportsmen)లకు పెద్ద పీట వేస్తోంది. ఇటీవల భారత షూటర్ ఇషాసింగ్ (Esha Singh) కు కూడా స్థలం పత్రాలను ఇచ్చారు. గతంలోనూ సానియా మీర్జా, పీవీ సింధు తదితరులకు తెలంగాణ ప్రభుత్వం భారీ నగదు బహుమతితో పాటు ఉద్యోగాలను ప్రకటించింది. ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఈ మేరకు క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన ప్రముఖ బాక్సర్ నిక్కత్ జరీన్ కు రాష్ట్ర క్రీడా శాఖ తరపున జూబ్లీహిల్స్ లో 600 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ అందుకు సంబంధించిన పత్రాలను నిక్కత్ జరీన్ తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ కు అందజేయడం జరిగింది. @nikhat_zareenpic.twitter.com/JxfMENo74s