»Sonu Nigam Attacked By Mlas Son And Goons In Mumbai
ప్రముఖ సింగర్ Sonu Nigamపై దాడి.. Selfie కోసం ఎమ్మెల్యే కొడుకు బీభత్సం
అతడి స్నేహితుడు ఉండడంతో కొద్దిలో బాలీవుడ్ స్టార్ సింగర్ సోను నిగమ్ క్షేమంగా బయటపడ్డాడు. ఈ సంఘటన బాలీవుడ్ లో కలకలం రేపింది. అయితే దాడికి పాల్పడింది ఓ ఎమ్మెల్యే కుమారుడు అని తెలుస్తోంది. ఆ ఈవెంట్ లో ఎమ్మెల్యే కుమారుడు రెచ్చిపోయాడు. దీనిపై సోనూ నిగమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి.
బహిరంగ సమావేశాల్లో జరిగే ఈవెంట్లకు హాజరు కావాలంటే సెలబ్రిటీలు పాల్గొనాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఎదురయ్యారు. ఇప్పటికే ప్రముఖ గాయకులు ఖైలాశ్ ఖేర్, సిద్ శ్రీరామ్, మంగ్లీపై దాడులు జరగగా.. మొన్న భారత క్రికెటర్ పృథ్వీషాపై దాడి జరిగింది. ఇది మరువకముందే మరో సెలబ్రిటీపై దాడి జరిగింది. స్టేజ్ పై నుంచి కిందకు వస్తుండగా కొందరు దుండగులు దాడి చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో అతడి భద్రతా సిబ్బంది మెట్ల పైనుంచి కిందపడిపోయారు. ఇక అతడి స్నేహితుడు ఉండడంతో కొద్దిలో బాలీవుడ్ స్టార్ సింగర్ సోను నిగమ్ (Sonu Nigam) క్షేమంగా బయటపడ్డాడు. ఈ సంఘటన బాలీవుడ్ (Bollywood)లో కలకలం రేపింది. అయితే దాడికి పాల్పడింది ఓ ఎమ్మెల్యే కుమారుడు అని తెలుస్తోంది. ఆ ఈవెంట్ లో ఎమ్మెల్యే కుమారుడు రెచ్చిపోయాడు. దీనిపై సోనూ నిగమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబైలోని చంబూర్ ప్రాంతంలో ఉద్దవ్ థాకరే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ ఫతర్ పెకర్ (Prakash Phatarpekar) ఓ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించాడు. ఈ కార్యక్రమంలో సోనూ నిగమ్ ను పాటలు పాడేందుకు ఆహ్వానించారు. ఈ వేడుకలో సోనూ నిగమ్ తన పాటలతో ఆహుతులను సమ్మోహితులను చేశాడు. కార్యక్రమం ముగియడంతో సోనూ కిందకు వస్తుండగా సెల్ఫీల కోసం కొందరు ఎగబడ్డారు. ఈ క్రమంలో వారు అత్యుత్సాహం ప్రదర్శించారు. వారిని వద్దని వారిస్తూ వేదిక పై నుంచి కిందకు దిగుతున్న సోను నిగమ్ పై ఎమ్మెల్యే కుమారుడు స్వప్నిల్ ప్రకాశ్ ఫతర్ పెకర్ (Swapnil Prakash Phatarpekar) దాడి తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. సోను నిగమ్ అంగ రక్షకులను నెట్టేశారు. దీంతో వారు మెట్లపై నుంచి కింద పడ్డారు. సోను నిగమ్ పై దాడి చేస్తుండగా స్నేహితుడు రక్షించాడు.
ఆ దుండగులు సోను నిగమ్ తో వాగ్వాదానికి దిగారు. వెంటనే అక్కడి నిర్వాహకులు స్పందించి సముదాయించి సోనును అక్కడి నుంచి పంపించారు. అయితే ఈ ఘటనపై తీవ్ర దుమారం రేపింది. ఈ దాడిని సోను నిగమ్ తీవ్రంగా పరిగణించాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా మీడియాతో సోను నిగమ్ మాట్లాడాడు. ‘రాత్రి పది గంటలకు కార్యక్రమం ముగిసింది. నేను హరి ప్రకాశ్, రబ్బనీ ఖాన్, సైరా మకానీతో కలిసి స్టేజ్ పై నుంచి కిందకు దిగుతున్నాం. ఒక యువకుడు అకస్మాత్తుగా వచ్చి నన్ను పట్టుకున్నాడు. హరిప్రకాశ్ అతడిని వారించి వద్దు అని చెప్పాడు. ఆ యువకుడు హరిప్రకాశ్ ను నెట్టివేశాడు. నన్ను కూడా నెట్టివేయడంతో కొంత కిందకు వచ్చా. రబ్బానీ ఖాన్ నన్ను నిలువరించడంతో కింద పడలేదు. కానీ మిగతా వారు కిందపడిపోయారు’ అని సోను నిగమ్ తెలిపాడు. ఈ ఘటనతో ఆ కార్యక్రమంలో గందరగోళం ఏర్పడింది. భద్రతా సిబ్బందికి గాయాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.
దాడి జరగలేదు
అయితే ఈ సంఘటనపై ఎమ్మెల్యే కుమార్తె సుప్రద ఫతర్ పెకర్ (Suprada Phaterpekar) వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా సోను నిగమ్ కు క్షమాపణలు చెప్పింది. ‘చెంబూర్ ఉత్సవాలు నిర్వహకులుగా మీకు వాస్తవాలు చెప్పాలనుకుంటున్నా. ఆ సంఘటన జరగడం దురదృష్టం. కార్యక్రమం ముగియగానే సోను నిగమ్ వేదిక దిగుతున్నాడు. ఈ సమయంలో నా సోదరుడు స్వప్నిల్ సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. అయితే అక్కడ అధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉండడంతో తోపులాట జరిగింది. అంతే కానీ అక్కడ ఎలాంటి దాడి జరగలేదు. వస్తున్న నిరాధార ఆరోపణలు ఎవరూ నమ్మొద్దు. ఈ సంఘటనను రాజకీయం చేయొద్దు’ అని సుప్రద ట్వీట్ చేసింది.
Shri Sonu Nigam is unhurt. On behalf of the organisation team, we have officially apologised to Sonu sir & his team for the unpleasant incident.
Please donot believe any baseless rumours and those who are trying to politicize the matter. ( 3/3 )