AP: ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న ఎయిరిండియా విమానానికి పొగమంచు కారణంగా ల్యాండింగ్ సమస్యలు ఎదురయ్యాయి. విమానాశ్రయం పరిసరాల్లో దట్టమైన పొగమంచు ఉండటంతో రన్వే స్పష్టంగా కనిపించలేదు. దీంతో ఏటీసీ అనుమతి కోసం పైలట్ విమానాన్ని చాలా సేపు గాల్లోనే చక్కర్లు కొట్టించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రయాణికులు కాస్త ఆందోళనకు గురయ్యారు.