MHBD: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ డోర్నకల్ మున్సిపాలిటీలో BRS పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపాలిటీలో BRSకు చెందిన ఇద్దరు మాజీ కౌన్సిలర్ తేజావత్ సంద్య రమేష్, పోటు జనార్ధన్ లు, సిగ్నల్ కాలనీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు నేడు కాంగ్రెస్లో చేరారు. ప్రభుత్వవిప్, డోర్నకల్ MLA డా.రాంచందర్ నాయక్ వారికి కనుమ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.