»Dadasaheb Phalke International Film Festival Best Film Award Goes To Rrr
RRRకు మరో ప్రతిష్టాత్మక అవార్డు.. త్వరలో ఆస్కార్ కూడా
అన్ని భాషల నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులతో పాటు వివిధ విభాగాల ప్రముఖులు హాజరవడంతో సందడి వాతావరణం అలుముకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతలను విశేషంగా అలరించాయి. అన్ని భాషల నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులతో పాటు వివిధ విభాగాల ప్రముఖులు హాజరవడంతో సందడి వాతావరణం అలుముకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతలను విశేషంగా అలరించాయి.
తెలుగు వారి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా RRR (రౌద్రం, రణం, రుధిరం). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన ఈ సినిమా ప్రతిష్టాత్మక అవార్డులను కొల్లగొడుతోంది. ఏ కేటగిరిలోనైనా.. ఏ అవార్డైనా తన ఖాతాలో వేసుకుంటోంది. ప్రస్తుతం ఆ చిత్ర బృందానికి ఆస్కార్ అవార్డు ఊరిస్తోంది. ‘నాటు నాటు’ (Natu Natu Song) పాట ఆస్కార్ కు నామినేట్ కావడంతో అవార్డు వస్తుందనే గంపెడాశలో భారత చిత్రసీమ ఉంది. అయితే దానికన్నా ముందే RRRకు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (Dadasaheb Phalke International Film Festival)లో ఆర్ఆర్ఆర్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్-2022 చిత్రంగా నిలిచింది.
ఈ అవార్డుల వేడుక ముంబై (Mumbai)లో సోమవారం రాత్రి సందడిగా జరిగింది. దేశంలోని అన్ని భాషల సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇక అవార్డుల విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ (2022)గా అవార్డు గెలుచుకుంది. ఇక ఎన్నో వివాదాలకు కారణమైన ది కశ్మీర్ ఫైల్స్ ఉత్తమ చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడుగా రణ్ బీర్ కపూర్ (Ranbeer Kapur) (బ్రహ్మాస్త్ర-1), ఉత్తమ నటిగా అలియా భట్ (Alia Bhatt) (గంగూబాయి కఠియావాడి) అవార్డులు కైవసం చేసుకున్నారు. సంచలన విజయం నమోదు చేసి రికార్డుల మోత మోగించిన కాంతారా (Kantara)లో నటనకు గాను రిషబ్ శెట్టి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును పొందాడు. సినీ పరిశ్రమకు అత్యుత్తమ సేవలందించిన రేఖకు 2023 సంవత్సరానికి గాను దాదా సాహెబ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును జ్యూరీ ప్రకటించింది.
ఈ అవార్డుల ప్రదానోత్సవం కోలాహలంగా సాగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవం కోలాహలంగా సాగింది. వరుణ్ ధావన్, శ్రేయ తల్పాడే, బాల్కి, షాహిల్ ఖాన్, వివేక్ అగ్నిహోత్రి, కాంతారా హీరో రిషబ్ శెట్టి తదితరులు అవార్డుల వేడుకకు హాజరయ్యారు. వీరితోపాటు అన్ని భాషల నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులతో పాటు వివిధ విభాగాల ప్రముఖులు హాజరవడంతో సందడి వాతావరణం అలుముకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతలను విశేషంగా అలరించాయి. అన్ని భాషల నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులతో పాటు వివిధ విభాగాల ప్రముఖులు హాజరవడంతో సందడి వాతావరణం అలుముకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతలను విశేషంగా అలరించాయి.
అవార్డులు
ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్: ఆర్ఆర్ఆర్ ఉత్తమ చిత్రం: ది కశ్మీర్ ఫైల్స్ ఉత్తమ దర్శకుడు : ఆర్ బాల్కి (చుప్: ది రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్) ఉత్తమ నటుడు: రణ్ బీర్ కపూర్ (బ్రహ్మాస్త్ర-1 ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కఠియావాడి) మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: రిషబ్ శెట్టి (కాంతారా)
వెబ్ సిరీస్ అవార్డులు ఉత్తమ వెబ్ సిరీస్: రుద్ర-ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్