BPT: అద్దంకి మండలంలో నామ్ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు మరో రెండు రోజుల్లో పరిహారం అందనున్నట్లు అద్దంకి తహశీల్దార్ చరణ్ శనివారం తెలిపారు. మండల పరిధిలోని గోపాలపురం, చక్రాయపాలెం, కలవకూరు గ్రామాలలో 122 మంది రైతులకు రూ.2.53 కోట్లు రైతుల ఖాతాలకు జమకానున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి అన్ని నివేదికలను ఉన్నతాధికారులకు పంపామన్నారు.