Relief To Congress Jubilee Hills Candidate Azaruddin
Azaruddin: మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్‌కు (Azaruddin) ఓ కేసులో బిగ్ రిలీఫ్ లభించింది. మల్కాజిగిరి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అజార్ ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే జూబ్లిహిల్స్ నుంచి పోటీ చేసే అంశంపై కూడా అనుమానం ఉండేది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అజారుద్దీన్ (Azaruddin) ఉన్న సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఫండ్స్ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన లావు నాగేశ్వరరావు కమిటీ ఫిర్యాదు మేరకు నాలుగు కేసులు కూడా ఫైల్ అయ్యాయి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. ఇంతలో కేసులతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు.
కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని మల్కాజిగిరి కోర్టును ఆశ్రయించాడు. పిటిషన్ విచారించిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. దీంతో రిలాక్స్ అయ్యాడు. అవినీతికి సంబంధించిన కేసుల్లో పోలీసుల విచారణకు సహకరించాలని కూడా అజారుద్దీన్ బెంచ్ స్పష్టంచేసింది.
అవినీతి కేసులో నాలుగైదు కేసులు నమోదయ్యాయి. ఒకటి కాకుంటే మరో కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎన్నికల వేళ అది మైనస్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించగా.. కోర్టు సానుకూలంగా స్పందించింది.