floating bridge: విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌పై ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. భారీ ఖర్చుతో అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన ఈ వంతేన ఏర్పాటు చేసిన మరుసటిరోజే తెగిపోయింది. ఈ ఘటనలో ఏలాంటి ప్రమాదం జరగలేదని నిర్వహకులు తెలిపారు.
floating bridge: శాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో పర్యటకుల కోసం ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. మంత్రి వైవీ సుబ్బారెడ్డి ఆదివారం ఈ వంతెనను అవిష్కరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దాదా రూ.1.60 కోట్లతో ఏపీ ప్రభుత్వం ఈ బ్రిడ్జిని ప్రతిష్టాత్యకంగా ఏర్పాటు చేసింది. ప్రారంభించిన రెండో రోజే ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడం పర్యటకుల్లో ఆందోళనను కలిగిస్తోంది. ఈ ప్రమాదం సమయంలో అందులో ఎవరు లేకపోవడంతో పెను ముప్పు తప్పింది.
బీచ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ వంతెన వల్ల ఇక్కడ పర్యటకుల సంఖ్య పెరుగుతుందని భావించారు. దీనిపై వెళ్లి ఆ అనుభూతిని పొందాలంటే రూ. 100 టికెట్టు ధర నిర్ణయించారు. ఇంతలోనే ఇది తెగిపోవడంతో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన విజువల్స్ ట్రెండ్ అవుతున్నా. దీనికి తోడు ప్రస్తుతం ఏపీలో రాజకీయ వాతావరణం ఏర్పడింది కాబట్టి దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపిస్తూ ట్రోల్స్ మొదలయ్యాయి.
విశాఖ ఆర్కే బీచ్ లో తెగి ముక్కలైన ఫ్లోటింగ్ బ్రిడ్జి. 100 మీటర్ల మేర తెగి సముద్రంలోకి పోయిన బ్రిడ్జి. ఈ సమయంలో టూరిస్టులు లేక తప్పిన ముప్పు. నిన్న అట్టహాసంగా ప్రాంభించిన ఎంపీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్.#AndhraPradesh#Vizag#Visakhapatnampic.twitter.com/gpwuyg8ZBJ