ప్రభుత్వ కార్యాలయాల తరలింపును అమరావతిలో రైతులు సవాల్ చేస్తూ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన హైకోర్టు దానిని త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది.
ఏపీ సర్కార్కు హైకోర్టు షాకిచ్చింది. విశాఖకు కార్యాలయాలను తరలించాలనుకున్న ఏపీ ప్రభుత్వం ఆ ఆశలపై నీళ్లు చల్లింది. ప్రస్తుతం కార్యాలయాల తరలింపు ప్రక్రియకు బ్రేక్ వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంత వరకూ కూడా కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధిస్తున్నట్లు తెలిపింది. ఈ తరుణంలో విశాఖకు కార్యాలయాల తరలింపు లేనట్టేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల తరలింపును అమరావతిలో రైతులు సవాల్ చేస్తూ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటీషన్ను ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి పంపుతామని హైకోర్టు వెల్లడించింది. రాజధాని కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధిస్తామని ధర్మాసనం వెల్లడించింది. దీంతో తాము ప్రభుత్వం నుంచి ఆదేశాలను తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది కోరారు.
దీంతో ఈ కేసు విషయంలో తదుపరి విచారణను హైకోర్టు (HighCourt) గురువారానికి వాయిదా వేసింది. నేడు మరోసారి హైకోర్టు విచారణ జరపగా హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. ఆ ధర్మాసనం తీర్పు వచ్చే వరకూ కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో విశాఖకు కార్యాలయాల తరలింపు మరికొంత కాలం పాటు ఆలస్యం కానుంది.