»A Large Number Of Drunk Case Were Jailed In Hyderabad
Drunk Case: నగరంలో భారీగా మందబాబులు అరెస్ట్
నగరంలో మందుబాబులపై పోలీసులు నిఘా పెంచారు. డ్రంక్ డ్రైవ్‌తో పట్టుబడిన వారికి జైలుకు తరలించారు. జూలై నెలలో ఏకంగా1,614 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
A large number of drunk case were jailed in Hyderabad
Drunk Case: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్‌పైనే కాదు మద్యం మీద కూడా ప్రభుత్వం నిఘా పెంచింది. తాగి పట్టుబడిన వాహనదారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అంటున్నారు. నగరంలోని ప్రధాన కూడలిలో మందుబాబుల కోసం పోలీసులు చెక్ పోస్టులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జంట నగరాల్లో ఈ డ్రగ్స్, మద్యంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే లిక్కర్ తాగి పట్టుబడ్డ వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దానిలో భాగంగా జూలై నెలలో ఇప్పటి వరకే భారీగా మందుబాబులు పట్టుబడ్డారు. జూలై 1 నుంచి 10 వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 55 మంది పోలీసులకు చిక్కారు. వాళ్లను కోర్టులో ప్రవేశపెట్టగా క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించినందుకు కోర్టు వారిని జైలుకు పంపింది.
దీనిపై పట్టణ ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ స్పందిస్తూ.. 10 రోజుల్లో 1,614 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. వీరిలో 992 కేసుల్లో ఛార్జ్ షీట్లు నమోదు చేశామని, వారందరిని కోర్టులో సమర్పించామని అందులో 55 మందికి కోర్టు జైలు శిక్ష విధించిందని వెల్లడించారు. అయితే వారిలో మార్పు కోసం కౌన్సిలింగ్‌తో పాటు ఒక రోజు నుంచి 15 రోజుల వరకు జైలు శిక్ష విధించినట్టు చెప్పారు. జైలు శిక్షతో పాటు 8 మంది డ్రైవింగ్ లైసెన్స్ లను 2 నుంచి 6 నెలల పాటు రద్దు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ఈ మేరకు ఆర్టీఏకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. మిగితా వారు తక్కువ మద్యం తీసుకోవడం తదితర కారణాల వలన ఫైన్ విధించినట్లు చెప్పారు. వారి నుంచి ఫైన్ల రూపంలో రూ. 21.36 లక్షలు జమ అయిందని ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.