KDP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లాలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గన్ లైసెన్స్‌లపై ప్రత్యేక దృష్టి సారించి, లైసెన్స్‌దారుల నేర చరిత్ర, కేసుల వివరాలను పరిశీలిస్తున్నారు. జిల్లాలో సుమారు 850 గన్ లైసెన్స్‌లు ఉండగా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై లైసెన్స్ రద్దుకు సిఫారసు చేయనున్నారు.