VSP: సింహాచల వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు శుక్రవారం విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు తిరుప్పావైలోని తిరుప్పావై సేవ – 4వ పాశుర విశిష్టత అయిన ‘ఆళిమళైక్కణ్ణా! ఒన్రు నీకై కరవెల్’ గీతాన్ని స్వామివారికి నివేదించారు. తెల్లవారుజామున భక్తులు గోదాదేవి పాశుర పారాయణాన్ని విన్నారు.