»Delhi Mayor Aap Candidate Shelly Oberoi Wins 34 Votes By Bjp
Delhi Mayor:గా ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ విజయం
గత ఏడాది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధికంగా విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ మూడు విఫల ప్రయత్నాల తర్వాత ఈరోజు తన మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్ 34 ఓట్ల తేడాతో గెలుపొందారు. మేయర్ ఎన్నికలో నామినేటెడ్ సభ్యులకు ఓటు వేయాలనే నిర్ణయంపై ఆప్, బీజేపీ సభ్యులు వాగ్వాదానికి దిగడంతో గతంలో మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశాలు వాయిదా పడ్డాయి.
పోటాపోటీగా కొనసాగిన దేశ రాజధాని ఢిల్లీ మేయర్(delhi mayor) ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది. ఈ ఎన్నికల్లో ఢిల్లీ కొత్త మేయర్‌గా ఆప్‌కి చెందిన షెల్లీ ఒబెరాయ్(shelly oberoi) బుధవారం 34 ఓట్ల తేడాతో గెలుపొందారు. మేయర్ ఎన్నికల్లో పోలైన మొత్తం 266 ఓట్లలో ఆప్ అభ్యర్థికి 150 ఓట్లు రాగా, బీజేపీ(bjp) అభ్యర్థి రేఖా గుప్తా(rekha gupta) 116 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఈ క్రమంలో పార్టీపై తమకున్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టినందుకు ఢిల్లీ ఓటర్లకు ఆప్(aap) కృతజ్ఞతలు తెలిపింది. గూండాలు ఓడిపోయారు, ప్రజానీకం గెలిచిందని డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal), మనీష్ సిసోడియా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రజలకు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు ఇచ్చిన 10 హామీలపై పని చేస్తానని ఢిల్లీకి కొత్తగా ఎన్నికైన మేయర్ షెల్లీ ఒబెరాయ్ చెప్పారు. దీంతోపాటు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మనం అందరం కలిసి పనిచేయాలన్నారు.
అసలు ఏం జరిగిందంటే
గత ఏడాది డిసెంబరులో జరిగిన డిల్లీ MCD ఎన్నికల్లో AAP విజయం సాధించింది. ప్రజా పాలనలో BJP 15 ఏళ్ల రికార్డును ఆమ్ ఆద్మీ పార్టీ ముగింపు పలికింది. ఆ క్రమంలో 134 వార్డులను కైవసం చేసుకుంది. 250 మంది సభ్యులున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ 104 వార్డులను గెలుచుకుంది. మునిసిపల్ ఎన్నికలు ముగిసిన ఒక నెల తర్వాత, జనవరి 6న మొదటిసారి సభ సమావేశమైంది. ఆ నేపథ్యంలో ఆప్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరగడంతో సభ వాయిదా పడింది. అయితే జనవరి 24, ఫిబ్రవరి 6న జరిగిన రెండు, మూడవ సమావేశాల్లో కూడా మేయర్‌ను ఎన్నుకోకుండానే వాయిదా పడ్డాయి.
సుప్రీంకోర్టును ఆశ్రయం
ఫిబ్రవరి 6న జరిగిన MCD హౌస్ మూడో సమావేశంలో ప్రిసైడింగ్ అధికారి చేసిన మూడు వివాదాస్పద తీర్పులు సభను గందరగోళంలోకి నెట్టాయి. 10 మంది నామినేటేడ్ కౌన్సిలర్లు ఓటింగ్ హక్కులు లభిస్తాయని చెప్పడంతో గందోరగోళం ఏర్పడింది. దీంతో ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్టీకి నిర్ణయాత్మక విజయంలో, మేయర్ ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులు ఓటు వేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. సాధారణంగా మేయర్ ఎన్నిక కోసం ఎలక్టోరల్ కాలేజీలో ఎన్నికైన 250 మంది కౌన్సిలర్లు, ఏడుగురు లోక్‌సభ, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ సాంప్రదాయబద్ధంగా నామినేటెడ్ సభ్యులు ఓటు వేయడానికి హక్కును కలిగి ఉండరు.
ఉత్కంఠ పోటీ
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఓటింగ్ ప్రక్రియ రెండు గంటలకు పైగా కొనసాగింది. మేయర్ ఎన్నికల తేదీని నిర్ణయించేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) తొలి సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు 24 గంటల్లోగా నోటీసు జారీ చేయాలని ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓటింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు, పెన్నులను కూడా అనుమతించలేదు. అంతేకాకుండా, మునుపటి మూడు మేయర్ ఎన్నికల బిడ్లు MCD హౌస్‌లో AAP-BJP షోడౌన్లో ముగియడంతో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు.
మేయర్ పదవికి షెల్లీ ఒబెరాయ్, అషు ఠాకూర్లను ఆప్ రంగంలోకి దించింది. ఒబెరాయ్ పార్టీ మొదటి ఎంపిక. రేఖా గుప్తా బీజేపీ అభ్యర్థిగా అగ్రస్థానానికి ఎంపికయ్యారు.