దేశ రాజధాని ఢిల్లీ ఈ రోజు మధ్యాహ్నం భూ ప్రకంపనాలతో వణికింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. నేపాల్‌లో గల జుమ్లాకు 69 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 1.30 గంటలకు భూమి కంపించగా.. దాని తీవ్రత 10 కిలోమీటర్ల లోతు వరకు ఉందని సిస్మలాజిస్టులు తెలిపారు.
earthquake:దేశ రాజధాని ఢిల్లీ ఈ రోజు మధ్యాహ్నం భూ ప్రకంపనాలతో వణికింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. నేపాల్‌లో గల జుమ్లాకు 69 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 1.30 గంటలకు భూమి కంపించగా.. దాని తీవ్రత 10 కిలోమీటర్ల లోతు వరకు ఉందని సిస్మలాజిస్టులు తెలిపారు.
గత కొన్ని నెలలుగా నేపాల్‌లో భూకంపాలు వస్తోన్న సంగతి తెలిసిందే. జనవరి 24వ తేదీన 5.8 తీవ్రతతో భూమి కంపించింది. గత ఏడాది నవంబర్‌లో 6.3 తీవ్రతతో వచ్చింది. ఆ సమయంలో భవనాలు కూలి దొతి జిల్లాలో ఆరుగురు చనిపోయారు.
ఈ రోజు ఢిల్లీ పరిసరాల్లో కూడా భూ ప్రకంపనాలు వచ్చాయి. చెన్నై మౌంట్ రోడ్స్, వైట్ రోడ్స్‌లో భూమి కంపించిది. దీంతో ఇళ్లల్లోంచి జనం బయటకు పరుగులు తీశారు. అండర్ గ్రౌండ్ మెట్రో పనుల వల్లే భూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. అదేం లేదని మెట్రో నిర్మాణ సంస్థ కొట్టిపారేసింది. ఢిల్లీలో రావడంతో చెన్నై వరకు దాని తీవ్రత ఉండి ఉండొచ్చనేది వారి వాదన.