హీరో అల్లరి నరేష్ నటించిన ఉగ్రం మూవీ టీజర్ రిలీజైంది. టీజర్లో నరేష్ యాక్టింగ్, ఫైట్స్ సహా పలు సీన్లు సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. నాంది ఫేం డైరెక్టర్ విజయ్ కనకమేడల, నరేష్ కాంబోలో వచ్చిన రెండో చిత్రం ఇది. ఇప్పటికే నాంది బంపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.
హీరో అల్లరి నరేష్(allari naresh) యాక్ట్ చేసిన ఉగ్రం సినిమా నుంచి టీజర్ విడుదలైంది. వీడియో మాత్రం అదిరిందనే చెప్పవచ్చు. అన్నా ఇక్కడ ఎవ్వడో మనోడిని కొట్టిండన్నా…ఆ నా కొడుకుని జంగల్ కి బలి ఇవ్వండనే డైలాగ్ తో వీడియో మొదలవుతుంది. నైట్ లైట్స్ ఎఫెక్టులో షూట్ చేసిన ఫైట్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. నాది కానీ రోజు కూడా నేను ఇలాగే నిలబడతానని నరేష్ చెబుతున్న డైలాగ్ కూడా సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. మరోవైపు బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ తోపాటు పలు సీన్లు ఉత్కంఠ రేపుతున్నాయి.
నరేష్ నటించిన నాంది చిత్రానికి దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడలది(Vijay Kanakamedala) ఇది రెండో చిత్రం కావడం విశేషం. ఈ మూవీ పూర్తిగా యాక్షన్, థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్ పోలీస్ ఆఫీసర్(police officer) పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. గతంలో కూడా పలుమార్లు ఈ పాత్రలో నటించాడు. కానీ ఈసారి పూర్తిగా ఓ యాక్షన్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో నరేష్ సరసన మలయాళ నటి మిర్ణా హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది.
ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే & దర్శకత్వం విజయ్ కనకమేడల అందించగా, సాహు గారపాటి & హరీష్ పెద్ది నిర్మాతలుగా వ్యవహించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. ఈ మూవీకి తూం వెంకట్ స్టోరీ(story) రాయగా, అబ్బూరి రవి(abburi ravi) డైలాగ్స్ రాయగా, ఎడిటర్ గా ఛోటా కె ప్రసాద్(chota k prasad) పనిచేశారు. ఈ సినిమా మే 5న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.