సంక్రాంతి టార్గెట్‌గా సినిమా షూటింగ్ మొదలు పెట్టి.. అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేసి హిట్ కొట్టాడు అక్కినేని నాగార్జున. కింగ్ లేటెస్ట్ మూవీ 'నా సామిరంగ' సంక్రాంతి రేసులో నిలిచి మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మూడు రోజుల్లో దుమ్ముదులిపేశాడు.
Naa Samiranga: సంక్రాంతి రేసులో మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేష్ ‘సైంధవ్’, తేజ సజ్జా ‘హనుమాన్’ సినిమాలతో పాటు నాగార్జున ‘నా సామిరంగ’ కూడా రిలీజ్ అయింది. సంక్రాంతి సినిమాల్లో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించుకున్న నా సామిరంగాలో నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ హీరోయిన్గా నటించింది. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు పోషించారు. అల్లరి నరేష్‌కు జంటగా మిర్నా మోహన్ నటిస్తుండగా.. రాజ్ తరుణ్ జోడీగా రుక్సార్ నటించింది. ఈ సినిమాతో డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా మారాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ మూవీ పై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే నా సామిరంగ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
పబ్లిక్ టాక్ పాజిటివ్‌గా ఉండడంతో నా సామిరంగ సినిమా చూడడానికి ఫ్యామిలీస్‌తో థియేటర్స్‌కి వెళ్లిపోతున్నారు. దీంతో మూడు రోజుల్లో 12.5 కోట్ల షేర్, 24.8 కోట్ల గ్రాస్‌ని రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు అన్ని సెంటర్స్‌లో నా సామిరంగ బ్రేక్ ఈవెన్ మార్క్‌కు చేరువలో ఉంది. సీడెడ్ లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ని టచ్ చేసి ప్రాఫిట్లోకి ఎంటర్ అయ్యింది. ఉత్తరాంధ్రాలో కూడా నా సామిరంగ బ్రేక్ ఈవెన్ మార్క్‌కి అత్యంత చేరువలో ఉంది. దీంతో నా సామిరంగ బయ్యర్స్‌కి మంచి లాభాలను తెచ్చిపెట్టడం ఖాయమంటున్నారు. మరి లాంగ్ రన్లో నా సామిరంగ ఎంత రాబడుతుందో చూడాలి.